ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా..

ABN, Publish Date - Oct 21 , 2024 | 11:14 PM

వాంకిడి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రామీణప్రాంతాల మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పర్చేందుకు జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ(డీఆర్డీఏ) సెర్ప్‌(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

- జిల్లాలోని ఐదు మండలాల్లో తేనెటీగల పెంపకం

- మండల సమాఖ్య ఆధ్వర్యంలో తేనేశుద్ధి కేంద్రం

- ఇప్పటి వరకు 15క్వింటాళ్ల శుద్ధి చేసిన తేనె విక్రయం

వాంకిడి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రామీణప్రాంతాల మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పర్చేందుకు జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ(డీఆర్డీఏ) సెర్ప్‌(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. స్థానికంగా లభించే వనరులతో మహిళలు స్వయంఉపాధి పొందేలా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాంకిడి మండలకేంద్రంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో తేనెశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వయంసంఘాల సభ్యుల నుంచి కొనుగోలు చేసిన తేనెను శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. దీంతో స్వయంసహాయక సభ్యులకు ఉపాధితోపాటు మండల సమాఖ్యకు లాభాలు చేకూరుతున్నాయి.

- ప్రభుత్వ సహకారంతో తేనె శుద్ధి కేంద్రం..

వాంకిడి మండల కేంద్రంలో వేంకటేశ్వర మండల సమాఖ్య ఆధ్వర్యంలో తేనెశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ సంస్థ రూ.14.14లక్షల రూపాయలు కేంద్రం నిర్వహణకు నిధులు మంజూరు చేసింది. రూ.3.50లక్షలతో తేనె శుద్ధి యంత్రం కొనుగోలు చేయగా రూ.7లక్షలతో గ్రామీణ మహిళలనుంచి తేనె కొనగోలు చేసేందుకు తేనె పెట్టెలు కొనుగోలు చేశారు. అనంతరం తేనె ఉత్పత్తి చేసే విధానం, తేనె సేకరణ తదితర అంశాలపై సభ్యులకు శిక్షణ ఇచ్చారు.

- తేనెటీగల పెంపకం, ఉత్పత్తిపై శిక్షణ

తేనెటీగల పెంపకం, ఉత్పత్తి చేసేందుకు జిల్లాలోని ఆసిఫాబద్‌, వాంకిడి, తిర్యాణి, సిర్పూర్‌(టీ), జైనూర్‌ మండలాల్లోని ఒక్కోగ్రామాన్ని ఎంపిక చేశారు. ఎంపికచేసిన గ్రామాల్లో 2022మే, జూన్‌ మాసాల్లో మండల సమాఖ్య ఆధ్వర్యంలో సభ్యులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగలను పెంచడం, అందులోని తేనె సేకరించే విధానాలపై హైదరాబాద్‌ నుంచి వచ్చిన శిక్షకులు మెలకువలు నేర్పించారు. వాంకిడి మండలంలోని ఆటవీప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల సభ్యులకు తేనె పెట్టెలను పంపిణీ చేశారు. వాటిని తమ పంటపొలాల్లో అనుకూలంగా ఉన్నచోట ఏర్పాటు చేసి తేనె ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో పెట్టెలో మూడు నుంచి నాలుగు కిలోల తేనె ఉత్పత్తి అవుతోంది. ఉత్పత్తి చేసిన తేనెను మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొనుగోలు చేసి తేనె శుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన తేనెను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో సంఘాల సభ్యులకు ఆర్థికాభివృద్ధి చేకూరుతోంది.

- సంఘాల సభ్యుల నుంచి కొనుగోలు..

గిరిజన స్వయం సంఘాల నుంచి కిలోకు రూ.250చొప్పున ఇప్పటివరకు 26క్వింటాళ్ల తేనెను కొనుగోలు చేశారు. శుద్ధి చేసిన తేనెను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. గత ఆగస్టు15 కంటే ముందు వరకు కిలో తేనెను రూ.500చొప్పున విక్రయించగా ప్రస్తుతం రూ.600లకు విక్రయిస్తున్నారు. 50 గ్రాములు, 100గ్రాములు, 250గ్రాములు, 500గ్రాములు, 1కిలో చొప్పున సిసాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 25క్వింటాళ్ల తేనెను శుద్ధి 15క్వింటాళ్ల తేనెను విక్రయించారు.

- ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతోంది.

- మహేష్‌, ఐకేపీ ఏపీఎం

తేనెటీగల పెంపకం, ఉత్పత్తితో స్వయం సహాయకసంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతోంది. మండలంలో అటవీ ప్రాంతాలనికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోని మహిళాసభ్యులకు తేనెటీగల పెంపకం, ఉత్పత్తిపై శిక్షణ ఇచ్చి, ఒక్కో సభ్యురాలికి అయిదు పెట్టెలను పంపిణీ చేశాం. సభ్యులు సేకరించిన తేనెను మండలసమాఖ్య ఆధ్వర్యంలో కొనుగోలు చేసి శుద్ధిచేసిన అనంతరం మార్కెట్లో విక్రయిస్తున్నాం. ఇప్పటివరకు సభ్యుల నుంచి 26క్వింటాళ్లు కొనుగోలు చేసి 15క్వింటాళ్ల తేనెను విక్రయించాం.

Updated Date - Oct 21 , 2024 | 11:14 PM