Kumaram Bheem Asifabad: ఘనంగా మొహర్రం
ABN, Publish Date - Jul 17 , 2024 | 10:48 PM
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 17: త్యాగాలకు ప్రతీకగా జరుపుకునే మొహర్రం పండుగ బుధ వారం భక్తిశ్రద్ధలతో ముగిసింది.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 17: త్యాగాలకు ప్రతీకగా జరుపుకునే మొహర్రం పండుగ బుధ వారం భక్తిశ్రద్ధలతో ముగిసింది. జిల్లా కేంద్రంలోని బజార్‌వాడి, హడ్కోకాలనీ, కంచుకోట, జన్కాపూర్, గొడవెల్లితోపాటు మండలంలోని ఆయాగ్రామాల్లో మొహర్రం చివరిరోజు పండుగను ఘనంగా నిర్వ హించారు. మలీద ముద్దలతో, బెల్లం షరబత్‌తో ప్రత్యేక వంటకాలతో డప్పు చప్పుల నడుమ వేలాది మంది భక్తులు సందడి చేస్తూ ఘనంగా నిర్వహిం చారు. పీరీల బంగ్లా నుంచి నృత్యాలు చేస్తూ ఉత్స వాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహ కులు నయీమ్, హసీన్, సుధాకర్, నారాయణ, బాబా, రఫీక్, రాకేష్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
జైనూర్: మండలంలోని సోనుపటేల్‌గూడ, పట్నాపూర్, కరీంగూడ, తదితరగ్రామాల్లో మొహ ర్రం బుధవారం వైభవంగా ముగిసింది. కరీం గూడలో హజ్రాబ్ బారఈమామ్ దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాలేజీగూడలో సవారీలకు ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాల్లో గ్రామపటేల్ అనక మారుతి, రాంజీ, దౌలత్‌రావ్, మహజన్ గేడాం మారు పాల్గొన్నారు.
సిర్పూర్(యు): మండలకేంద్రంతోపాటు ప్రెసి డేంట్‌గూడ, పాములవాడ, పంగడి తదితర గ్రామా ల్లో బుధవారం మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో మతాలకు అతీతంగా ఘనంగా జరుపుకున్నారు. లింగాపూర్ మండలం పటకల్‌మంగి, జైనూర్ మండలం పాలొస గ్రామంనుంచి పీరీలను మండల కేంద్రానికి తీసుకొచ్చారు. ఆయాగ్రామాల నుంచి వచ్చిన పీర్లలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యం సమర్పించారు.
కాగజ్‌నగర్/రెబ్బెన: కాగజ్‌నగర్ పట్టణం, మండలంలో బుధవారం మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పీరీలకు మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని భట్టుపల్లి, బారెగూడతో పాటుపలుగ్రామాల్లో అట్ట హాసంగా మొహర్రం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా షర్బత్, మలీదలు నైవేద్యంగా సమర్పించారు. కులమతాలకు అతీతంగా ఈ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. కార్యక్రమాల్లో దేవరవినోద్, మల్లేష్, మందయ్య,మెంగాజీ, గ్రామస్థులు పాల్గొన్నారు. రెబ్బెనమండలంలోని పుంజుమేరగూడలోని భువమ్మ తల్లిదేవస్థానంలో పెద్దసరిగెత్తును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వినోద్ జైస్వాల్, నికోడే శ్రీకర్, శ్రీకాంత్, నిమ్మాజీ, భగవాన్, రాకేష్, దుర్గం వెంకటి, బొడ్డు రాజు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా భక్తులకు షర్బత్ పంపిణీ చేశారు.
బెజ్జూరు: మండలకేంద్రంతోపాటు ఎల్కపల్లి, మర్తిడి, కుకుడ తదితరగ్రామాల్లో పీరీలు ఏర్పాటు చేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గోల్కొండ మసీ ద్‌కమిటీ ఆధ్వర్యంలో షరబత్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిటీసభ్యులు అమీరుద్దీన్, యూసు ఫ్‌ఖాన్, మథిల్, తాయోద్దీన్, ఫిరోజ్,నజీముద్దీన్, తాహిర్ తదితరులు పాల్గొన్నారు.
దహెగాం: మండలవ్యాప్తంగా బుధవారం పీరీలను ప్రత్యేకంగా అలంకరించి గ్రామాల్లో ఊరే గింపు నిర్వహించారు.
వాంకిడి: మండలంలోని ఖమాన, వాంకిడి, బం బార, ఇంధాని తదితర గ్రామాల్లో పీరీల బంగ్లాల వద్ద ప్రజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మొహరం పండుగ సందర్బంగా తొమ్మిదిరోజులపాటు ఉన్న ఉపవాసాలను విరమిం చారు. భాజా భజంత్రీలతో పీర్లను గ్రామవీధుల్లో ఊరేగిస్తూ సమీప చికిలి వాగులో నిమజ్జనం చేశారు. మొహరం సందర్భంగా ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా సీఐ శ్రీనివాస్, ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated Date - Jul 17 , 2024 | 10:48 PM