ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: గ్రూపు-3 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

ABN, Publish Date - Nov 16 , 2024 | 10:01 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల్లో నిర్వహించే గూప్రు-3పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

- జిల్లాలో 18పరీక్షా కేంద్రాలు

- హాజరుకానున్న 4471మంది అభ్యర్థులు

ఆసిఫాబాద్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల్లో నిర్వహించే గూప్రు-3పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆసిఫా బాద్‌ జిల్లాకేంద్రంలో9, కాగజ్‌నగర్‌పట్టణంలో9 మొత్తం 18పరీక్షాకేంద్రా లను ఏర్పాటుచేశారు. ఆసిఫాబాద్‌లో 2304మంది, కాగజ్‌నగర్‌లో 2167 మంది మొత్తం 4471మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. 58మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు 100మందికి పైగా ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ విధించారు. పరీక్షాకేంద్రాలవద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకో కుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రా లను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలను, సలహాలను అందిం చారు. అంతకుముందు జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 9.30గంటలకు పరీక్షాకేంద్రం గేట్లు మూసి వేస్తామన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించమ న్నారు. సమావేశంలో ఏఎస్పీ ప్రభాకర్‌ రావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 10:01 PM