Kumaram Bheem Asifabad: గ్రూపు-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:09 PM
ఆసిఫాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఈనెల 17,18తేదీల్లో జరగనున్న గ్రూపు-3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఈనెల 17,18తేదీల్లో జరగనున్న గ్రూపు-3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపుకలెక్టర్ దీపక్‌తివారి, సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఏఎస్పీ ప్రభాకర్ రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, పరీక్షల రీజనల్ కో ఆర్డినే టర్ లక్ష్మినర్సింహతో కలిసి చీఫ్ సూపరింటెండెంట్‌లు, శాఖ అధికారులు, పరిశీలకులు, రూట్ అధికారులు ఐడెంటిఫికేషన్ సిబ్బందితో సమీక్షాసమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూపు-3 పరీక్షకు జిల్లాలో 18పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశామన్నా రు. పరీక్షాకేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకేట్లు, విద్యుత్, వైద్యసిబ్బంది తదితర అన్నివసతులు కల్పిస్తు న్నామన్నారు. పరీక్షాకేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సమీప జీరాక్స్‌సెంటర్లు మూసి వేయించాలన్నారు. పరీక్షాకేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెం డెంట్ తప్ప వేరేఎవరికి మొబైల్ అనుమతి లేదని తెలి పారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతిపరీక్ష కేంద్రం వద్ద పటి ష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో సహా యరీజన్ కోఆర్డినేటర్‌రాజేశ్వర్ పాల్గొన్నారు.
బ్యాంకర్లు వార్షిక రుణలక్ష్యాలను సాధించాలి..
ఆర్థిక సంవత్సరం2024-25కి సంబంధించిన వార్షిక రుణ లక్ష్యాలనుసాధించే దిశగా బ్యాంకర్లు కృషి చేయా లని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో స్టేట్‌బ్యాంక్‌ఆఫ్‌ఇండియా ప్రాంతీ య సమన్వయకర్త సుర్జిత్ కార్తికేయన్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీ నర్ శ్రీహరితో కలిసి ద్వితీయత్రైమాసిక సమావేశానికి హాజరై బ్యాంకు అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వార్షిక సంవ త్సరంలో నిర్దేశించిన రుణలక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకర్లు సమన్వయంతో కృషిచేయాలని తెలిపారు. స్వయం సహాయకసంఘాల బ్యాంకులింకేజిలు వంద శాతం పూర్తి చేసే విధంగా బ్యాంకర్లు, సెర్ప్‌అధికారులు కృషిచేయాలని తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన, ముద్ర స్టార్టప్ ఇండియా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు ఉపాధి కల్పించే విదంగా రుణ మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ సంక్షేమ కార్పొరేషన్, ఎస్టీ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాలలో రాయతీనిధుల మంజూ రుకు చర్యలు తీసుకోవాలని, అసంఘటిత రంగాల వారు ఉపాధిపొంది ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. ప్రతి బ్యాంకు శాఖలు నాలుగు గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాలలో ఆర్థిక అక్షరాస్యత కల్పనపై అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో లీడ్ డిస్టిక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, జిల్లాగ్రామీణాభి వృద్ధి అధికారి దత్తారాం, అదనపు గ్రామీణాభి వృద్ధి అధికారి రామకృష్ణ, గిరిజన అభివృద్ధి అధికారిణి రమాదేవి, ఎస్సీ అభివృద్ధి అధికారి సజీవన్, బ్యాంకు మేనేజర్లు, సెర్ప్, మెప్మా అధికారులు, డీడీఎంలు, తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు పూర్తిచేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి గ్రామలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు రావడానికి తేదీల వారీగా రైతులకు టోకెన్లు జారీచేయాలన్నారు.
నిబంధనల ప్రకారం17శాతం తేమఉంటేనే కేంద్రానికి తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తూకం జరిగిన ధాన్యంను వెంటనే కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా గ్రామీణాభి వృద్ధి అధికారి దత్తారాం, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, వ్యవసాధికారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 11:09 PM