ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

ABN, Publish Date - Nov 01 , 2024 | 11:12 PM

ఆసిఫాబాద్‌రూరల్‌/కెరమెరి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఇతర అన్ని అంశాలపై ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబసర్వేను జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహించా లని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు.

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌రూరల్‌/కెరమెరి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఇతర అన్ని అంశాలపై ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబసర్వేను జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహించా లని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్‌ మండలం అడ గ్రామపంచాయతీ, పట్ట ణంలోని బజార్‌వాడి ఏరియాలో, కెరమెరి మండల కేంద్రంలోని కెరమెరి గ్రామపంచాయతీలో కొనసాగు తున్న సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సర్వేను జిల్లాలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహిం చాలని తెలిపారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో సర్వేకు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించామన్నారు. ప్రతి ఎన్యుమరేటర్‌ ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల వ్యక్తిగతవివరాలు, కుటుంబ వివ రాలు సేకించాలని తెలిపారు. కేటాయించిన ఎన్యుమరేషన్‌ బ్లాక్‌ కింద నిర్ణయించిన కుటుంబాల వివరాలు నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేటర్‌ సేకరించిన వివరాలలో 10 శాతం రాండమ్‌ కుటుంబాలను ఎంపిక చేసుకొని ఆ ఇళ్లను సూపర్‌వైజర్‌ సందర్శించి వివరాలను పునఃపరిశీలించాలని తెలిపారు. వివరాల సేకణలో గోప్యత, నైతిక ప్రమాణాలు పాటించాలన్నారు. కేటాయించిన బ్లాక్‌లో అన్ని కుటుంబా లను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2024 | 11:12 PM