ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: రైతు(కు) భరోసా అందేనా?

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:15 PM

చింతలమానేపల్లి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌ ముగిసింది.. యాసంగి సీజన్‌ వచ్చేసింది.. అయినా ప్రభుత్వం రైతుభరోసాపై స్పష్టతనివ్వడం లేదు. కనీసం ఈ సీజన్‌లోనైనా పెట్టుబడి సాయం అందుతుందా..అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

- యాసంగి సాగు వచ్చే..

- పెట్టుబడి సాయం ఊసెత్తని సర్కార్‌..

- భారంగా మారుతున్న విత్తన, ఎరువుల కొనుగోలు..

చింతలమానేపల్లి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌ ముగిసింది.. యాసంగి సీజన్‌ వచ్చేసింది.. అయినా ప్రభుత్వం రైతుభరోసాపై స్పష్టతనివ్వడం లేదు. కనీసం ఈ సీజన్‌లోనైనా పెట్టుబడి సాయం అందుతుందా..అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం 2018యాసంగి వానాకాలం నుంచి 2023యాసంగి వరకు వరుసగా 12సార్లు పెట్టుబడి సాయం అందించింది. సీజన్‌ ప్రారంభానికి ముందే రైతు బంధు ఇవ్వడంతో రైతులు సకాలంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేవారు.

స్పష్టత కరువు..

గతేడాది డిసెంబరులో కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి రాగానే రైతుభరోసా ప్రతీఏడాది ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 11నెలలు గడిచినా పెట్టుబడి సాయంపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే వానాకాలం సీజన్‌ గడిచిపోయింది. యాసంగిసీజన్‌ రానేవచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు సాగు అంచనా సైతం ఖరారు చేస్తున్నారు. వానాకాలంలో ఎలాగూ ఇవ్వలేదు. కనీసం యాసంగిలోనైనా సాయం అందుతుందా..లేదా అంటూ రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గందరగోళంగా రుణమాఫీ..

జిల్లాలో రుణమాఫీ సైతం గందరగోళంగా మారింది. ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేశారో అర్థం కాని పరిస్థితి నెలకొం దని రైతులు వాపోతున్నారు. లేనిపోని సాకులతో అనేక మంది రైతుల రుణాలు మాఫీకాలేదు. తెల్లరేషన్‌ కార్డు లేని వారికి అధికారులు కుటుంబ నిర్ధారణ చేశారు. అయితే ఇప్పటివరకు వారి ఖాతాల్లో రుణడబ్బులను జమ చేయలేదు. ఈవిషయంపై రైతులు అధికారులను అడిగితే తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం నేరుగా డేటా తీసుకుందని అంటున్నారు. అలాగే రైతుభరోసా సైతం ఏ ప్రాతిపదికన ఇస్తారనేది ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.

విత్తనాలు, ఎరువులు ఇలా..

జిల్లాలోని యాసంగి సీజన్‌లో సుమారుగా 2లక్షల ఎకరాల పైనే వివిధపంటలు సాగవుతాయని అంచనా ఉంది. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, నువ్వులు, మినుములు, పెసరా, కూరగాయలు తదితర పంటలు సాగవుతాయి. అయితే జిల్లాలోని రైతులకు సుమారుగా యూరియా 20వేల టన్నులు, డీఏపీ 12వేల టన్నులు, పొటాష్‌ 5వేల టన్నులు, కాంప్లెక్స్‌ 20వేల టన్నుల వరకు అవసరమయ్యే అవకాశం ఉన్నది. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా అధి కారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతు భరోసా అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.

పెట్టుబడి సాయం అందజేయాలి..

- చౌదరి ఓంకార్‌, రైతు, చింతలమానేపల్లి

యాసంగి సీజన్‌లో నేను రెండు ఎకరాల్లో పెసరా పంట, అరఎకరంలో మొక్కజొన్న సాగు చేస్తున్నాను. ఈ పంటలకు పిచికారి చేసేందుకు పురుగుమందులు, ఇతర ఎరువులు కావాల్సి ఉన్నది. ప్రస్తుతం చేతిలో డబ్బులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా అందజేస్తే పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Updated Date - Nov 14 , 2024 | 11:15 PM