Kumaram Bheem Asifabad: ధ్రువపత్రాల జారీ గడువులోగా పూర్తిచేయాలి
ABN, Publish Date - Oct 09 , 2024 | 10:38 PM
కౌటాల, అక్టోబరు 9: వివిధ ధ్రువపత్రాల కోసం చేసుకున్న దరఖాస్తు లను పరిశీలించి గడువులోగా జారీచేయాలని సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా అన్నారు.
- కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా
కౌటాల, అక్టోబరు 9: వివిధ ధ్రువపత్రాల కోసం చేసుకున్న దరఖాస్తు లను పరిశీలించి గడువులోగా జారీచేయాలని సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా అన్నారు. బుధవారం ఆమె మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయా న్ని తనిఖీచేశారు. రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో అందిన దరఖాస్తులను రికార్డులతో సరి చూసిక్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసు కోవాలని తెలిపారు.
Updated Date - Oct 09 , 2024 | 10:38 PM