ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: కాలుష్యం కోరల్లో కాగజ్‌నగర్‌

ABN, Publish Date - Sep 06 , 2024 | 11:05 PM

జిల్లా కార్మిక వర్గానికి వరప్రదాయినిగా చెబుతున్న సిర్పూరు పేపరు మిల్లు(ఎస్పీఎం) ఈ ప్రాంతం ప్రజానీకానికి పరోక్షంగా అనారోగ్యాన్ని ప్రసాదిస్తోంది.

- ఎస్పీఎం వ్యర్థాలతో కలుషితమవుతున్న పెద్దవాగు జలాలు

- నాలుగు మండలాల ప్రజలపై ప్రభావం

- పల్ప్‌శుద్ధి కోసం అధిక మోతాదులో రసాయనాల వాడకం

- వ్యర్థ జలాలలతోనే పలు చోట్ల పంటలు పండిస్తున్న రైతులు

- వ్యాధుల బారిన ప్రజలు

- పట్టించుకోని అధికార యంత్రాంగం

జిల్లా కార్మిక వర్గానికి వరప్రదాయినిగా చెబుతున్న సిర్పూరు పేపరు మిల్లు(ఎస్పీఎం) ఈ ప్రాంతం ప్రజానీకానికి పరోక్షంగా అనారోగ్యాన్ని ప్రసాదిస్తోంది. ఎస్పీఎం నుంచి వెలువడే విష వాయువులు, విషరసాయన జలాలతో ఇక్కడి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. కాగితం తయారీలో యాజమాన్యం చూపుతున్న శ్రద్ధ ఫ్యాక్టరీ విడుదల చేసే వ్యర్థాలపై పెట్టకపోవడంతో కాగజ్‌నగర్‌ పట్టణంతోపాటు పరిసరమండలాలు కాలష్యకోరల్లో కొట్టు మిట్టాడుతున్నాయి.

- ఆసిఫాబాద్‌

జిల్లాలోని కాగజ్‌నగర్‌లో నిజాంకాలంలో ఏర్పాటు చేసిన సిర్పూరు కాగితపు పరిశ్రమ అనేక ఒడిదుడుగులను ఎదుర్కొంటూ ఇప్పటికే ముగ్గురు చేతులు మారింది. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా 600మందిపైగా పరోక్షంగా పదివేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. బిర్లా కుటుంబం చేతిలో నష్టాలపాలై సెప్టెంబరు 27, 2014లో మూసివేసిన తర్వాత కార్మికుల ఆందోళనతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జేకేసంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక రాయితీలు ప్రకటించి ఆగస్టు 2, 2018లో పునరుద్ధరించింది. ఈ క్రమంలో పాతయంత్రాల స్థానంలో కొన్ని యంత్రాలను మార్చినప్పటికీ పూర్తిస్థాయిలో ఇంకా ఆధునీకరించలేదు. కాగా కాగితపుతయారీలో కీలకమైన గుజ్జుశుద్ధిచేసే క్రమంలో అధిక మోతాదులో రసాయనాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో చాలా మటుకు హానికరమైనవేనని చెబుతున్నారు. కాగా పల్ప్‌(కర్రను ద్రవపదార్థంగా మార్చే ప్రక్రియ) శుద్ధి చేసిన తర్వాత వదులుతున్న వ్యర్థజలాల్లో కూడా ఇంకా రసాయనిక ఆవశేషాలు మిగిలిఉండటం వల్ల ఆనీరు ప్రదేశం అంతా కాలుష్యంగా మారుతోంది. రసాయనాలతో ప్రవహించే నీటిని కాగజ్‌నగర్‌ పరిసరాల్లో చాలామంది రైతులు వరిసాగుకు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్ప డింది. రసాయనిక వ్యర్థాలతో కూడిన నీటిని వాడి పంటలు పండించటం వల్ల ఆ ఉత్పత్తులను వినియోగించిన వారికి పలురకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గాలి,నీరు విషతుల్యం..

ఎస్పీఎం ద్వారా విడుదలవుతున్న వ్యర్థాల కారణంగా గాలి, నీరు విషతుల్యమవుతున్నాయి. ఫ్యాక్టరీ నుంచి వెదజల్లే పొగతో పట్టణమంతా దుర్వాసన వస్తోంది. పట్టణంతోపాటు సమీప మండలాల్లో గాలిద్వారా విషవాయువులు వ్యాప్తిచెందడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. వర్షం కురిసినప్పుడల్లా పొగగొట్టాల ద్వారా వెళ్లాల్సిన పొగ గాలిలో ఉన్న తేమ వల్ల కిందకు వచ్చి పట్టణమంతా వ్యాప్తిచెందుతోంది. దీంతో శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పట్టణమంతా పొగతో కమ్మేస్తుండడంతో ఆయా కాలనీవాసులు ఇబ్బం దులు పడుతున్నారు. అలాగే పెద్దవాగులో జలాలు కలుషితం అవుతుండడంతో పాటు ఈ వ్యర్థం ప్రవహించే పరివాహకం ప్రాంతంలోని కాలనీల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు ఈ వాసన భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పల్ప్‌ శుద్ధి తర్వాత విడుదల చేసే వ్యర్థ జలాలతో ఎలాంటి హానీ కారక రసాయాలు లేవని ఫ్యాక్టరీ ప్రతినిధులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ నీరు ప్రవహించిన పంట భూములన్నీ తెల్లబారిపోయి దిగుబడులు కూడా తగ్గుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి విడులయ్యే ఈ వ్యర్థ జలాలు మసాలవాగులో కలిసి అక్కడినుంచి కిలోమీటరు దూరంలో ఉన్న పెద్దవాగులోకి కలుస్తుండడంతో పెద్దవాగు పరివాహక ప్రాంతంలో ఉన్న కాగజ్‌నగర్‌, దహెగాం, పెంచికల్‌పేట, బెజ్జూరు మండలాల్లోని చాలా గ్రామాలకు చెందిన ప్రజలు ప్రభావితం అవుతున్నట్టు చెబుతున్నారు. కొంతకాలంగా ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే జలాలతో పెద్దవాగు నీరు కూడా దుర్వాసన వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ వాగు పరివాహక ప్రాంతంలోనే అరుదైన జంతువులు, పక్షులు మనుగడ సాగిస్తున్నాయి. ఫ్యాక్టరీవ్యర్థాలు పెద్దవాగులో కలువడం వల్ల వాగు పరివాహక ప్రాంతంలోని వణ్యప్రాణులు, పక్షులు, అరుదైన జలచరాలపై ప్రభావం పడుతోంది. ఈ భరించరాని వాసనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కాగితం తయారీలో వాడే రసాయనాల వల్ల రోగ నిరోధకశక్తి తగ్గిపోవడం, గుండె, ఊపిరితిత్తుల, కంటి సంబంధిత వ్యాధులు, శ్వాసనాళ సంబంధిత వ్యాధులు, దగ్గు, దమ్ము వంటి అనారోగ్యకరమైన దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి.

దుర్గంధంతో ఇబ్బందులు..

- అంబాల ఓదెలు, కాగజ్‌నగర్‌

ఎస్పీఎం నుంచి వెలువడే దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, రాత్రివేళల్లో దీని తీవ్రత అధికంగా ఉంటోది. మిల్లు పరిసరప్రాంతాల కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పట్టణమంతా పొగతో కమ్మేస్తోంది. ఫ్యాక్టరీ వ్యర్థాలతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. కాగజ్‌నగర్‌తోపాటు సమీప మండలాల ప్రజలపై ప్రభావం పడుతోంది. కాలుష్య నియంత్రణ మండలి అఽధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలి.

Updated Date - Sep 06 , 2024 | 11:05 PM

Advertising
Advertising