ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: బీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే భయంతోనే కవిత అరెస్టు

ABN, Publish Date - Mar 16 , 2024 | 10:17 PM

ఆసిఫాబాద్‌/జైనూరు, మార్చి 16: రానున్న పార్ల మెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే భయం తోనే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని ఆసిఫా బాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జైనూరులో జడ్పీటీసి కోవ అరుణ ఆరోపించారు.

ఆసిఫాబాద్‌/జైనూరు, మార్చి 16: రానున్న పార్ల మెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే భయం తోనే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని ఆసిఫా బాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జైనూరులో జడ్పీటీసి కోవ అరుణ ఆరోపించారు. లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై జిల్లాకేంద్రంలో, జైనూరులో ప్రధానరహదారిపై బీఆర్‌ఎస్‌పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహిం చారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్న భయంతోనే బీజేపీ ఈడీ అధికారు లతో కవితను అరెస్టు చేయించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీఎం మోదీ చోటా భయ్య బడా భయ్య లెక్క వ్యవహరిస్తూ ములాఖత్‌ అయ్యారన్నారు. అర్థ రాత్రి మహిళను అరెస్టు చేయడం రాజ్యాంగ విలు వలను తుంగలో తొక్కడమేనని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని మోది డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కవితపై కేసులు ఎత్తివేసి భేషరతుగా విడుదల చేయాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఆసిఫాబాద్‌లో జడ్పీటీసీ ధ్రుపతాబాయి, ఎంపీపీ సౌందర్య, మోతీ రాం, నాయకులు సరస్వతి, శ్రీనివాస్‌, భీమేష్‌, జీవన్‌, నిసార్‌, జైనూరులో ఎంపీపీ తోడ్సంభాగ్యలక్ష్మీ, వైస్‌ ఎంపీపీ ఆత్రంప్రకాష్‌, కనక యాదవ్‌రావ్‌, సహకార చైర్మన్‌ కొడపహన్నుపటేల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 10:19 PM

Advertising
Advertising