Kumaram Bheem Asifabad: ముదిరాజుల హక్కుల కోసం పోరాడుదాం
ABN, Publish Date - Nov 21 , 2024 | 10:21 PM
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 21(ఆంధ్ర జ్యోతి): ముదిరాజుల హక్కుల కోసం పోరాడు దామని తెలంగాణ ముదిరాజ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు సేర్ల మురళీ పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 21(ఆంధ్ర జ్యోతి): ముదిరాజుల హక్కుల కోసం పోరాడు దామని తెలంగాణ ముదిరాజ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు సేర్ల మురళీ పేర్కొన్నారు. గురు వారం జిల్లా కేంద్రంలోని ముదిరాజ్ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అంత కుముందు పెద్దమ్మ తల్లికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ ముదిరాజుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని పేర్కొన్నారు. బీసీ-డీలో ఉన్న తమను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సతీష్, రవి, రాజేష్, నరేష్, బాలేష్, సాయిరాం, శంకర్, రవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
బోదంపల్లిలో ముదిరాజ్ దశాబ్ది ఉత్సవాలు
కౌటాల, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని బోదంపల్లిగ్రామంలో గురువారం ముదిరాజ్ దశాబ్దిఉత్సవా లను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ముదిరాజుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని పేర్కొన్నారు. బీసీ-డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. ముదిరాజులు అన్నివిధాల వెనకబడి ఉన్నారని వారి సంక్షే మం, అభివృద్ధికోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం మండలాధ్యక్షుడు కమలాకర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మత్స్యకార దినోత్సవం
బెజ్జూరు: మండలంలోని హేటిగూడగ్రామంలో గురు వారం ముదిరాజ్‌సంఘం ఆధ్వర్యంలో మత్స్యకార దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ముదిరాజ్ మండలాధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశానికి చర్యలు చేపట్టి కులగణన సంపూర్ణంగా పూర్తిచేసి బీసీలకు రిజర్వేషన్లు జనాభా ప్రాతిపాదికన పెంచాలని డిమాండ్ చేశారు. రిజర్వేష న్లలో ముదిరాజ్‌లకు జనాభాకు తగ్గట్టు వాటా కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మహేష్, సన్యాసి, మహేష్, అశోక్, లింగయ్య, అంజయ్య, శ్రీశైలం, శ్రీనివాస్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 21 , 2024 | 10:21 PM