Kumaram Bheem Asifabad: బాలల హక్కులను కాపాడుదాం: కలెక్టర్
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:13 PM
ఆసిఫాబాద్, నవంబరు 14(ఆంద్రజ్యోతి): బాలల హక్కులను సమిష్టిగా కాపాడుదామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, నవంబరు 14(ఆంద్రజ్యోతి): బాలల హక్కులను సమిష్టిగా కాపాడుదామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మాజీప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జిల్లా మహిళా, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాలలదినోత్సవంలో జిల్లా సంక్షేమశాఖాధికారి భాస్కర్‌తో కలిసి హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలనచేసి నెహ్రూ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌మాట్లాడుతూ బాల్యం చాలా అమూ ల్యమైనదని అన్నారు. బాలలకు తల్లిదండ్రులు, ఉపాధ్యా యులపట్ల గౌరవభావం అలవర్చాలని అన్నారు. సమా జంలో ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహించాలని అన్నారు. నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని, దేశ భవిష్యత్ అని, బాలల సంక్షేమం, సంరక్షణకు అందరం సమిష్టిగా కృషిచేద్దామని తెలిపారు. అనంతరంవిద్యార్థులు సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి మహేష్, సీడీపీవో సాదియా రుక్సానా, బాలరక్షక్ భవన్, సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు..
ఆసిఫాబాద్‌రూరల్: గ్రంథాలయాలు విజ్ఞాన బాం డాగారాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లాకేంద్ర గ్రంథాలయశాఖ భవనంలో ఏర్పాటుచేసిన 57వ జాతీయగ్రంథాలయ వారోత్సవాలకు అదనపుకలెక్టర్ దీపక్‌తివారితో కలిసి ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాల యాలు విజ్ఞానాన్ని అందించే బాండాగారాలని అన్నారు. ఈనెల 20వరకు జిల్లాలో జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాల న్నారు. గ్రంథాలయాల్లో ఎన్నో ప్రాచీనచరి త్రకు సంబంధించిన గ్రంథాలు ఉంటాయ ని తద్వారా భవిష్యత్ తరాలకు మనచరిత్ర తెలుస్తుందని అన్నారు. మనకువిద్య అందిం చిన గురువులకు, తల్లితండ్రులకు ఎప్పుడు రుణపడి ఉండాలన్నారు. మన లక్ష్యాన్ని సాధించడంలో గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపకరంగా ఉంటాయన్నారు. పాఠ కులు, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్య ర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రంథా లయ కార్యదర్శి సరిత, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.
వసతిగృహ పనులను త్వరగా పూర్తిచేయాలి
ఆసిఫాబాద్ రూరల్: జిల్లాలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు వసతికల్పించేందుకు చేపట్టిన వసతిగృహ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రేఅన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జన్కాపూర్ లో పాతకలెక్టరేట్ వైటీసీ భనవంలో నర్సింగ్‌కళాశాల విద్యార్థులకు వసతిగృహం ఏర్పాటుకు చేపట్టిన పనులను అదనపు కలెక్టర్ దీపక్ తివారితోకలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతిగృహంలో విద్యా ర్థినులకు ఎలాంటిఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని తెలిపారు. భవన మరమ్మతులు, మూత్రశాలలు, ఇతరపనులను వెంటనే పూర్తిచేయాలని అఽధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యంకలగకుండా చర్యలుతీసుకోవాలన్నారు. కార్యక్ర మంలో కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రహరీ నిర్మించాలి..
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠ శాలకు ప్రహరీ నిర్మించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం మండలంలోని మోతుగూడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రహరీ నిర్మించాలని విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 11:13 PM