ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: పల్లెల్లో ‘స్థానిక’ సందడి

ABN, Publish Date - Nov 07 , 2024 | 10:30 PM

చింతలమానేపల్లి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎప్పుడు నోటిఫికేషన్‌ విడుదల అయినా పోటీలో ఉండేలా ఆశావాహులు సన్నద్దమవుతున్నారు.

- సంక్రాంతి లోపు గ్రామాల్లో కొత్త పాలకులు

- మంత్రి పొంగులేటి ప్రకటనతో ప్రజల్లోకి ఆశావహులు

- రిజర్వేషన్లపై ఉత్కంఠ

- బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు పార్టీల వ్యూహాలు

- జిల్లాలో 3,48,370 మంది ఓటర్లు

చింతలమానేపల్లి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎప్పుడు నోటిఫికేషన్‌ విడుదల అయినా పోటీలో ఉండేలా ఆశావాహులు సన్నద్దమవుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తులో భాగంగా వార్డులు, పంచాయతీల వారీగా ఓటరుజాబితా ఇప్పటికే విడుదల కావడంతో ఒక్కసారిగా పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఓటరు జాబితా పట్టుకుని ఆశావాహ నేతలు సామాజికవర్గాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ఖరారు అయిన తరువాత అందుకు అనుగుణంగా ఆయాపంచాయతీలు, వార్డులనుంచి అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రధానరాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అదే విధంగా ఏ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసినా సమర్థవంతంగా నిర్వహించేందుకు అఽధికారయంత్రాంగం సైతం సిద్ధ మవుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

పంచాయతీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికలను ప్రభుత్వం సంక్రాంతి పండుగ లోపు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. దీంతో పాటు ప్రభుత్వం కులగణన సర్వే చేపడుతోంది. ఈ సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు నిర్ణయించనుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పంచాయతీ రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ప్రజల్లోకి ఆశావాహులు..

త్వరలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావాహులు ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆశావహులు ప్రజల్లోనే ఉంటూ గ్రామాల్లో చిన్నాచితక శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము పోటీల్లో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజల్లో పేరున్న తాజామాజీలు మళ్లీ ప్రజల మధ్యే ఉంటుండగా మరికొన్ని చోట్ల అధికారపార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వం తమదేని తాము ఉంటేనే పనులు అవుతాయని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కోగ్రామంలో నలుగురైదుగురు ప్రయత్నాలు చేస్తున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో అదే పార్టీకి చెందిన సర్పంచ్‌లే 90శాతం నెగ్గారు. ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉండడంతో ఈ సారి తమను ఆదరిస్తారని కాంగ్రెస్‌శ్రేణులు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. జిల్లాలో ఇటీవల అధికారులు వెలవరించిన ఓటరు తుదిజాబితాల్లో 3,48,370మంది ఓటర్లు ఉన్నట్లు వెలువరించగా గతపంచాయతీ ఎన్నికలతో పోలిస్తే 79,412మంది ఓటర్లు పెరిగారు. పంచాయతీ ఎన్నికలకు ముందు జిల్లాలో 2,68,917మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,36,074మంది పురుషులు, 1,32,810మంది మహిళలు, ఇతరులు 38మంది ఉన్నారు. జిల్లాలో 335గ్రామపంచాయతీలు ఉండడంతో గతంలో 50శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించారు.

మండలం పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం

ఆసిఫాబాద్‌ 14762 14979 0 29741

బెజ్జూరులో 11608 11878 2 23488

చింతలమానేపల్లి 12016 11684 0 23700

దహెగాం 10858 10894 0 21752

జైనూరు 11779 12235 0 24014

కాగజ్‌నగర్‌ 22387 21720 2 44109

కెరమెరి 11984 11665 1 23650

కౌటాల 13597 13298 1 26896

లింగాపూర్‌ 5018 5359 0 10377

పెంచికలపేట 6231 6044 0 12275

రెబ్బెన 14381 13950 0 28331

సిర్పూర్‌(టి) 10892 10964 1 21857

సిర్పూర్‌(యూ) 5748 6326 2 12076

తిర్యాణి 8738 9122 4 17864

వాంకిడి 14298 13939 3 28240

మొత్తం 1,74,297 1,74,057 16 3,48,370

Updated Date - Nov 07 , 2024 | 10:30 PM