ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: పీవీటీజీల అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ABN, Publish Date - Oct 28 , 2024 | 11:23 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ తెగల్లో వెనకబడ్డ తెలగలైన పీవీటీజీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ తెగల్లో వెనకబడ్డ తెలగలైన పీవీటీజీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. మండలంలోని ఆదివాసీ గ్రామ మైన బనార్‌గొంది, కుటోదలో ప్రధాన మంత్రి జన్‌మన్‌పథకం ద్వారా రూ.60 లక్షలవ్యయంతో నిర్మించతలపెట్టిన బహు ళార్థక భవననిర్మాణాలకు సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచం అభివృద్ధి పథంలో దూసుకు పోతుంటే ఆదివాసీలు ఇంకా వెనకబడి ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. వారి అభివృ ద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఆదివాసులు ప్రభు త్వాలు అందిస్తున్న పథకాలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, డీఈ నిజాముద్దీన్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 11:23 PM