ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: అందని ‘ఆసరా’

ABN, Publish Date - Dec 05 , 2024 | 11:08 PM

చింతలమానేపల్లి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): పింఛన్లను పెంచడంతోపాటు కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు.

- దరఖాస్తులు స్వీకరించి నెలలు గడుస్తున్నా కలగని మోక్షం

- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు

- మండల కేంద్రాల్లో పోటెత్తుతున్న దరఖాస్తులు

- ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

చింతలమానేపల్లి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): పింఛన్లను పెంచడంతోపాటు కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. అట్టహాసంగా తీసుకున్న దరఖాస్తులకు నేటికీ మోక్షం కలగడం లేదు. అవి ఇప్పుడు ఏ దశలో ఉన్నాయో తెలియని అయోమయ స్థితిలో దరఖాస్తుదారులు ఉన్నారు. ఇక కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు ఎప్పుడు పింఛన్‌ వస్తుందోనని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు..

వయస్సు మీద పడ్డవారు, వితంతువులు, వికలాంగులు, అర్హులైనవారు ఇప్పటికే దరఖాస్తులు చేసుకొని పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. సుమారుగా రెండున్నరేళ్ల నుంచి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. చాలా మంది ఎంపీడీవో, మున్సిపల్‌, కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో ధరఖాస్తులు సమర్పించి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో ఇది పింఛన్ల పరిస్థితి..

జిల్లాలోని 15మండలాల పరిధిలోని 335గ్రామ పంచాయతీల్లో ఆసరా పింఛన్ల లబ్ధిదారులు 54,589 మంది ఉండగా, రూ.12,76,65,936 రాష్ట్ర ప్రభుత్వం జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ద్వారా పోస్టల్‌ శాఖకు అందజేస్తోంది. బ్రాంచ్‌పోస్టు మాస్టర్ల ద్వారా ప్రతీనెలా 1వ తేదిన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో వృద్ధులు 23,253 మంది, దివ్యాంగులు 5858మంది, గీతా కార్మికులు 133మంది, ఒంటరి, వితంతువులు 21,612మంది పింఛన్లు పొందుతున్నారు.

వెలువడని ప్రకటన..

గతంలో ప్రతీనెలా కొత్త పింఛన్లు అమలు చేసే విధానం ఉండేది. రెండేళ్లుగా పింఛన్ల మంజూరుపై ఎలాంటి ప్రకటన రావడం లేదు. ప్రతీనెలా అర్హులు దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు విచారణ చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పక్కన పెడుతున్నారు. ఈ ఏడాది అక్టోబరులోనే నూతన పింఛన్‌ విధానం మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. భార్యాభర్తల్లో ఎవరైనా ఆసరా పింఛన్‌ పొందుతూ చనిపోతే ఆ పింఛన్‌ను భాగస్వామికి బదిలీ చేస్తున్నారు. పోయిన ఏడాది నుంచి స్పౌజ్‌ పింఛన్ల ప్రక్రియ కొనసాగుతోంది. స్పౌజ్‌ పింఛన్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే మరుసటి నెల నుంచే పింఛన్‌ను బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారుగా 6 వేలపైనే దరఖాస్తులు చేసుకున్నారు. ఎలాగూ కొత్త పింఛన్లు ఇవ్వడం లేదన్న కారణంతో అర్హులుగా ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవడం లేదు. వారందరూ దరఖాస్తులు చేసుకుంటే సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. కొత్త పింఛన్లు, పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ప్రభుత్వం నిర్ణయం మేరకు అర్హులైన ప్రతీఒక్కరికి అందజేస్తామని ఆయా మండలాల అధికారులు చెబుతున్నారు.

అర్హులైన వారందరికి పింఛన్‌ మంజూరు చేయాలి..

- చౌదరి ఓంకార్‌, దివ్యాంగుడు

నేను గతేడాది ప్రమాదవశాత్తు కాలు కోల్పోవడంతో దివ్యాంగుడినయ్యాను. సదరం సర్టిఫికేట్‌ తీసుకొని నెలలు గడుస్తున్నా దరఖాస్తులను స్వీకరించడం లేదు. వెంటనే సంబంధిత శాఖాధికారులు దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ పింఛన్‌లు పంపిణీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2000ఉన్న పెన్షన్‌ రూ.4000, దివ్యాంగులకు రూ.4000 నుంచి రూ.6000లకు పెంచాలి. అర్హులైన వారందరికీ పింఛన్‌లు అందజేసి ఆదుకోవాలి.

Updated Date - Dec 05 , 2024 | 11:08 PM