ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad:ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలి: కలెక్టర్‌

ABN, Publish Date - May 23 , 2024 | 10:20 PM

ఆసిఫాబాద్‌, మే 23: వరిధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

-కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 23: వరిధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. అద నపు కలెక్టర్‌ దాసరివేణుతో కలిసి గురువారం ఆసిఫాబాద్‌ మండలం అప్పపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈనెల 30లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. కొనుగోళ్లలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కారం దిశగా కృషిచేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలపై నిర్వాహకులను ఆరా తీశారు. ఈనెల 30లోగా కొనుగోళ్లు పూర్తిచేయాలన్నారు. తూకంలో మోసాలు లేకుండా చూడాలన్నారు. రైతుల వారీగా కొనుగోళ్లు, సాగు విస్తీర్ణం,ఽ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున టార్పాలిన్‌లు, గన్నీ బ్యాగులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని తెలి పారు. ధాన్యం తేమశాతంపై రైతులకు అవగాహన కల్పించాల న్నారు. ఆయనవెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నర్సింహారావు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ వినోద్‌కుమార్‌, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి రబ్బానీ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 23 , 2024 | 10:20 PM

Advertising
Advertising