Kumaram Bheem Asifabad : ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్
ABN, Publish Date - Nov 11 , 2024 | 10:39 PM
ఆసిఫాబాద్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరింరాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
ఆసిఫాబాద్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరింరాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దహెగాం మడలం దేవాజీగూడ గ్రామానికి చెందిన సిద్దం శ్రీహరి తనపేరిట ఉన్న భూమి తనఆధీనంలో ఉండగా ఆన్‌లైన్‌లో భూమిని తనకు విక్రయించిన వారిపేరిట చూపుతోందని, సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దహెగాం మండల కేంద్రానికి చెందిన బక్కయ్య ఐనం శివారులో కొనుగోలు చేసి రిజిస్టర్ అయిన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌కు చెందిన సాయికుమార్ నిరుపేద అయిన తనకు ప్రభుత్వ వైద్య కలాశాలలో ఉపాధి కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని అర్జీ సమర్పించారు. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌కు చెందిన గంతిదాస్ మండలంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని, మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన శాంత తాను కాగజ్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసు పత్రిలో పదిసంవత్సరాలుగా స్టాఫ్‌నర్సుగా పనిచేశానని తనను అకారణంగా తొలగించినందున తనకు న్యాయం చేయాలని అర్జీ సమర్పించారు. కెరమెరి మండల కేంద్రంలోని జడ్పీపాఠశాల ఉపాధ్యాయుడు గోపాల్ తనకు పెం డింగ్ వేతనాలు ఇప్పించాలని, చింతలమానేపల్లి మండలం డబ్బాకు చెందిన భీమయ్య తనభూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించివెంటనే పరిష్కరించాలని అధికారు లను ఆదేశించారు.
Updated Date - Nov 11 , 2024 | 10:39 PM