Kumaram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరిస్తాం
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:13 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తు లను త్వరగా పరిష్కరించే విధంగా అధికా రుల సమన్వయంతో చర్యలు తీసుకుంటా మని అదనపుకలెక్టర్ దాసరి వేణు అన్నారు.
- అదనపు కలెక్టర్ దాసరి వేణు
ఆసిఫాబాద్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తు లను త్వరగా పరిష్కరించే విధంగా అధికా రుల సమన్వయంతో చర్యలు తీసుకుంటా మని అదనపుకలెక్టర్ దాసరి వేణు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్డీవో లోకేశ్వర్ రావుతోకలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాగజ్‌నగర్ మండలం మాలి నికి చెందిన పరమేష్ తనకు ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద పట్టాపాసు పుస్తకం మంజూరు చేయా లని దరఖాస్తు అందజేశారు. దహెగాం మండలం రాంపూర్‌కు చెందిన గిరిజనులు తమకు గిరివికాస్ పథకం కింద బోరు బావులు తవ్వించారని, విద్యుత్ సరఫరా కిల్పంచి మోటారుపంపులు బిగించాలని అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పోచమ్మబస్తీకి చెందిన దెబ్బటి పద్మ తన భర్త మరణించినందున తన కు వితంతుపెన్షన్ ఇప్పించా లని దరఖాస్తు అందజేశారు. బెజ్జూరు మండలం మర్తిడికి చెందిన శంకరబాయి ఆసరా పెన్షన్ ఇప్పించాలని, ఈదుల వాడకు చెందిన యువకులు క్రీడాప్రాంగణం కేటాయించాలని, ఆసిఫాబా ద్‌కు చెందిన చంద్రశేఖర్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించాలని, కౌటాల మండలంకు చెందిన వెంకటేశ్వర స్వయంసహాయక సంఘం ప్రతినిధులు తమగ్రామంలో రేషన్ డీలర్‌గా వరలక్ష్మిని నియమించాలని, రెబ్బెన మండలం రాంపూర్‌కు చెందిన ప్రేంకుమార్ ఈజీఎస్ ఉపాధికార్డు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.
అధికారులు సమన్వయంతో
పనిచేయాలి..: సబ్ కలెక్టర్
కాగజ్‌నగర్: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ఆయాశాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. సోమవారం ప్రజాఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. అలాగే వివిధ గ్రామాల నుంచి ఫిర్యాదులు చేసిన వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 23మంది వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు.
Updated Date - Oct 21 , 2024 | 11:13 PM