ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: జైనూరులో కొనసాగుతున్న ఆంక్షలు

ABN, Publish Date - Sep 06 , 2024 | 10:57 PM

జైనూరు/ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 6: జైనూరు మండలంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.

- రెండో రోజు కట్టుదిట్టమైన భద్రత

- ఇరువర్గాల ఆందోళనతో రూ.కోట్లలో నష్టం

- ఆస్తినష్టంపై అంచనాలు వేస్తున్న అధికారులు

- ఆసిఫాబాద్‌ డీఎస్పీపై బదిలీవేటు

జైనూరు/ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 6: జైనూరు మండలంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర అదనపు డీజీ మహేష్‌భగవత్‌, ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డితో పాటు పలు జిల్లాల ఎస్పీలు అశోక్‌కుమార్‌, అఖిల్‌మహాజన్‌, గౌస్‌ ఆలం, బాలా నగర్‌ డీసీపీ సురేష్‌కుమార్‌ జైనూరులోనే మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇరువర్గాల ఘర్షణలో సంభవించిన ఆస్తినష్టంపై అధికారులు నివేదికలను రుపొందించే పనిలోపడ్డారు. ఏమేరకు ఆస్తినష్టం సంభవించింది, ఎన్ని ఇండ్లు, దుకాణాలు దగ్ధం అయ్యాయి అని అంచనాలను రూపొందిస్తు న్నారు. ఇందుకోసం ప్రత్యేకాధికారిగా డీఎస్పీ కరుణా కర్‌ను నియమించారు.

కొనసాగుతున్న 144 సెక్షన్‌..

జైనూరులో 144సెక్షన్‌ కొనసాగుతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసు ఉన్నతాధి కారులతో పాటు వెయ్యి మందికి పైగా స్పెషల్‌ పార్టీ పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ టీంలు బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి జైనూరు వైపు ఎవరినీ రాకుండా అడ్డుకుం టున్నారు. జైనూరు నుంచి ఆసిఫాబాద్‌ వైపు, జైనూరు నుంచి ఉట్నూర్‌ వైపు, జైనూరు నుంచి లింగాపూర్‌ వైపు పికెటింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసి కొత్త వ్యక్తులను ఎవరినీ అనుమతించడంలేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.

ఆసిఫాబాద్‌ డీఎస్పీపై బదిలీ వేటు:

జైనూరులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘటనలో ఆసిఫా బాద్‌ డీఎస్పీ సదయ్యపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఈ మేరకు మల్టీజోన్‌-1ఐజీ పి చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో కాగజ్‌నగర్‌ డీఎస్పీగా పనిచేస్తున్న కరుణాకర్‌ను ఆసిఫాబాద్‌ డీఎస్పీగా నియమిం చారు.

ఏజెన్సీ మండలాల్లో

కొనసాగుతున్న బంద్‌..

జైనూరులో జరిగిన ఘటనతో జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో రెండురోజులుగా బంద్‌ కొనసాగు తోంది. సిర్పూర్‌ (యు), లింగాపూర్‌, తిర్యాణి, కెరమెరి, వాంకిడి మండలాల్లో వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా బంద్‌ చేశారు. రెండు రోజులుగా బంద్‌తో ప్రజలు నిత్యావసర సరు కులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫా బాద్‌ డిపో నుంచి ఆదిలాబాద్‌వైపు ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ ప్రాంతా లకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా రు. ప్రయాణికులు మంచిర్యాల మీదుగా ఉట్నూర్‌, ఆదిలాబాద్‌కు ప్రయాణిస్తున్నారు.

నిలిచిన ఇంటర్నెట్‌తో ఇక్కట్లు..

ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీసేవా కేం ద్రాలు, ఏటీఎంలు, ఇతర ఇంటర్నెట్‌ ఆధారితసేవల్లో నడవడం లేదు. ఆన్‌లైన్‌ పేమెంట్‌లకు సైతం బ్రేక్‌ పడింది.

నేటి నుంచి ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరణ

శనివారం ఉదయం నుంచి జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ద రించనున్నట్లు జిల్లా అధికార వర్గాలు వెల్లడిం చాయి. జైనూరుతోపాటు లింగాపూర్‌, తిర్యాణి, సిర్పూర్‌(యు), కెరమెరి, వాంకిడి మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు ఉండవని, మిగితా మండ లాల్లో మాత్రమే ఇంటర్నెట్‌ సేవలు అందు బాటులో ఉంటాయన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 10:57 PM

Advertising
Advertising