ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ప్రమాదాలకు నిలయంగా ఆర్వోబీ

ABN, Publish Date - Nov 03 , 2024 | 10:51 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 3: కాగజ్‌నగర్‌-ఈసుగాం వెళ్లే మార్గంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం ఇంతవరకు తేరుకోవటం లేదు. ప్రమాదాలు జరుగకుండా ఈ మార్గం గుండా ఉన్న మూలమలుపుల వద్ద కనీసం బోర్డులు కూడా ఏర్పాటు చేయటం లేదు.

-ఆర్వోబీపై అలుముకున్న అంధకారం

-మూలమలుపు వద్ద బోర్డులు లేక తంటాలు

కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 3: కాగజ్‌నగర్‌-ఈసుగాం వెళ్లే మార్గంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం ఇంతవరకు తేరుకోవటం లేదు. ప్రమాదాలు జరుగకుండా ఈ మార్గం గుండా ఉన్న మూలమలుపుల వద్ద కనీసం బోర్డులు కూడా ఏర్పాటు చేయటం లేదు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై వీధిదీపాలు వెలుగకపోవటం కూడా మరో సమస్యగా ఉంది. నిత్యం ఈసుగాం-కాగజ్‌నగర్‌ మధ్య వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పెంచికల్‌పేట, బెజ్జూరు, మహారాష్ట్ర వెళ్లే మార్గం కూడా ఇదే కావటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. కాగా రెండేళ్లలో ఇప్పటివరకు పది రోడ్డు ప్రమాదాలు ఈ రహదారిపై చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ట్రాఫిక్‌ ఉండడం, అతివేగంగా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఈ ప్రాంతాన్ని కనీసం యాక్సిడెంట్‌ జోన్‌గా కూడా గుర్తించటం లేదు. ప్రాణాలు పోతున్నా అధికారులకు పట్టడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ దారిపై ప్రమాదాలు నివారించాంటే కనీసం ఆర్వోబీ ముందు, చివరి భాగంలో రెండు స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించే అవకాశాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కూడా కేవలం అతివేగం, అంధకారంతోనే జరిగినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగజ్‌నగర్‌ మండలం బోడెపల్లికి చెందిన ఎగ్గె మాధవ్‌(24) చింతగూడలో ఉన్న అతని బావతో కలిసి ఇంటికి వెళ్లుతున్న క్రమంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మాధవ్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అధికారులు ముందే స్పందించి ఉంటే తమ కొడుకు బతికే వాడని కుటుంబ సభ్యులు వాపోయారు. అలాగే ఈ బ్రిడ్జికి కొంతదూరంలో భట్టుపల్లి, ఈసుగాం చౌరస్తాలు ఉన్నాయి. రెండూ కూడా ప్రమాదకరంగా మూలమలుపుల్లో ఉన్నాయి. అతివేగం, వాహనాల రద్దీ ఈప్రాంతంలో ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

అధికారులు స్పందించాలి..

-లెండుగురే శ్యాంరావు, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కన్వీనర్‌

ఆర్వోబీ వద్ద తరుచూప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంతవరకు అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రమాదాలు జరిగి ప్రాణాలుపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఆర్వోబీకి మొదట, చివరి భాగంలో స్పీడ్‌బ్రేకర్లు నిర్మిస్తే కొంత మేలు జరుగుతుంది. అలాగే మితిమీరిన వేగంతో వచ్చే వాహనాల వారికి అపరాద రుసుము విధించాలి. ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూడాలి.

Updated Date - Nov 03 , 2024 | 10:51 PM