Kumaram Bheem Asifabad : బాలికల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:09 PM
ఆసిఫాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): బాలికల విద్య,ఆరోగ్యంపై ప్రత్యేకదృష్టి సారి స్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): బాలికల విద్య,ఆరోగ్యంపై ప్రత్యేకదృష్టి సారి స్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోఏఎస్పీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే కోవలక్ష్మి, జిల్లా సంక్షేమశాఖాధికారి భాస్కర్‌తోకలిసి జిల్లామహిళా, శిశుసంక్షేమ శాఖఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జా తీయ బాలికలదినోత్సవ కార్యక్రమానికి హాజ రయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ బాలికలు తమఆరోగ్యంపై శ్రద్ధవ హించాలని, ఏకగ్రాగతతో కష్టపడిచదివి ఉన్నతస్థానాన్ని చేరుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంక్షేమంలో భాగంగా విద్య,వైద్యంవంటి ఎన్నో కార్యక్రమాలు చేపడు తున్నాయన్నారు. బేటి బచావో- బేటి పడావో కార్యక్రమం ద్వారా బాలికలసంక్షేమం కోసం కృషిచేస్తామన్నారు. బాలి కలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా లో 32బాలికల ఆశ్రమపాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినులకు నిర్వహించి నపోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు ప్రదానంచే శారు.కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తా రాం, జీసీడీవోశకుంతల,పీఏసీఎస్‌చైర్మన్ అలీబీన్ అహ్మద్, సీడీపీవోలు,సూపర్‌వైజర్లు,తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 06 , 2024 | 11:09 PM