Kumaram Bheem Asifabad: రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:37 PM
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లా కేద్రంలో రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లా కేద్రంలో రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టర్ నేషనల్ హైవే మేనేజర్ రంజన్‌కుమార్, ఆర్డీవో లోకే శ్వర్‌రావుతో కలిసి నేషనల్ హైవేను పరిశీలించారు. ఈ ందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ హైవే నుంచి పట్టణానికి వచ్చే రహదారి మూలమలుపు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలి పారు. మూలమలుపు వద్ద ఉన్న ప్రాంతాన్ని చదును చేసి రోడ్డువిస్తరణ చేపట్టాలని అధికారులకు సూచిం చారు. భారత్ పెట్రోల్‌పంపు సమీపంలో ఉన్న యూటర్న్‌ను మూసివేయించాలని ఆదేశించారు. సాయిబాబా ఆలయ సమీపం నుంచి నేషనల్ హైవే వరకు అప్రోచ్‌రోడ్డుకు బీటీ వేయాలని సూచించారు. రోడ్డు వెడల్పులో సమాధులు కోల్పోతుండడంతో వారి పేరున మొక్కలు నాటాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీకరుణాకర్, మున్సిపల్ కమీ షనర్ భుజంగరావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
ప్రజలకు మరింత చేరువలో మెరుగైన వైద్యం
జిల్లాప్రజలకు మరింతచేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, ట్రాన్స్‌జెండర్స్ క్లినిక్‌లను ప్రారంభించిందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలలో భాగంగా హైదరాబాద్‌లోని బుద్ధ పూర్ణిమ రోడ్డు వద్ద రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 108నూతన అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలో 16నర్సింగ్, 28పారామెడికల్ కళాశాలలు, 33జిల్లాలో జిల్లాకు ఒకటి చొప్పున మైత్రిట్రాన్స్ క్లినిక్‌లను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ తదితరులు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిం చారని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆడిటో రియంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవ త్సరం పూర్తవుతున్న సందర్భంగా జిల్లాకు నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, ట్రాన్స్‌జెండర్స్ క్లినిక్‌ను మంజూరు చేసిందన్నారు. అనంతరం నర్సింగ్‌కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సీతారాం, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు శ్రీలక్ష్మి, పద్మలత, లత తది తరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:37 PM