ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు: కలెక్టర్‌

ABN, Publish Date - May 30 , 2024 | 11:01 PM

ఆసిఫాబాద్‌, మే 30: డీలర్లు నకిలీవిత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పాత్రికేయు లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు.

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 30: డీలర్లు నకిలీవిత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పాత్రికేయు లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. జిల్లావ్యాప్తంగా 3.38లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని పండిస్తున్నారని తెలిపారు. జిల్లాలో విత్తనాల కొరత లేదన్నారు. విత్తనడీలర్ల వద్ద ప్రస్తుతం సరి పడా స్టాక్‌ ఉందన్నారు. రైతులకు జూన్‌ 25వరకు విత్తనాలు డీలర్ల వద్ద లభిస్తాయని తెలిపారు. జిల్లాకు 6.50లక్షల ప్యాకెట్లు అవసరం కాగా ప్రస్తుతం 5లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నాసిరకం విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుం టామన్నారు. రైతులు విడిగా విత్తనాలు తీసుకోకుండా కంపెనీలోగో ఉన్న విత్తనప్యాకెట్లను మాత్రమే కొను గోలు చేయాలన్నారు. రైతులు విత్తనాలు వేసి తరు వాత ఖాళీ బ్యాగులను, రశీదులను భద్రపర్చుకోవా లన్నారు. లైసెన్సు కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలన్నారు. అధిక ధరలకు ఎవరైనా విత్తనాలను విక్రయిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. డీలర్లు తమ లైసెన్సు వివరాలను, విత్తన వివరాలను, నిలువను షాపు ముందు బోర్డుపై ప్రదర్శించాలని తెలిపారు. విత్తనాల నిలువలు, ఏయే కంపెనీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయో వాటి ధరల పట్టికను ప్రతిరోజు షాపు ముందు ప్రదర్శించా లని తెలిపారు. మండలాల్లో రెండు డివిజన్లలో పోలీ సు, రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటి వరకు విత్తనాల అక్రమ రవాణాపై జిల్లాలో ఏడు కేసులను నమోదుచేసి 26.50లక్షల విలువచేసే 10 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పా రు. పత్తివిత్తనాల అక్రమరవాణా, అధికధరలు, నాసి రకం విత్తనాలు డీలర్లు విక్రయించినట్లయితే రైతులు కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూం.నెం. 6904686505కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్ర మంలో ఏఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీ సదయ్య, డీపీఆర్వో సంపత్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 11:01 PM

Advertising
Advertising