Kumaram Bheem Asifabad: విషమంగానే విద్యార్థినుల ఆరోగ్యం
ABN, Publish Date - Nov 03 , 2024 | 10:46 PM
వాంకిడి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినుల ఆరోగ్యం విషమంగానే ఉంది.
- ఇద్దరు విద్యార్థినులు హైదరాబాద్ నిమ్స్‌కు తరలింపు
- అదుపులోకి రాని వాంతులు, విరేచనాలు
వాంకిడి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినుల ఆరోగ్యం విషమంగానే ఉంది. మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శైలజ అనే విద్యార్థినికి వెంటిలేటర్‌పైనే చికిత్సలు అందిస్తున్నారు. వాంతులు, విరేచనాలు అదుపులోకి రావడం లేదు. రోజురోజుకు వాంతులు, విరేచనాలతో అస్వస్తతకు గురవు తున్న విద్యార్థినుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం నుంచి ఆదివారం వరకు దాదాపు 60మందికి పైగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గుర య్యారు. శనివారం సాయంత్రం ఇద్దరు, ఆదివారం ఉదయం మరో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని వాంకిడి ఆస్పత్రులలో చేర్పించారు. శనివారం మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ ఆసుపత్రులకు తరలించిన విద్యార్థినులు ఇంకా కోలుకోలేదు. మంచిర్యాలలోని ప్రైవేట్‌ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న ఆరుగురు విద్యార్థినుల్లో శైలజ అనే విద్యార్థినికి వెంటిలే టర్‌పై చికిత్స అందిస్తుండగా కుడ్మెతజ్యోతి (9వతరగతి), మహాలక్ష్మి (8వతరగతి) అనే విద్యార్థినుల పరిస్థితి కూడా విష మంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మరోముగ్గురు విద్యార్థినులకు మంచిర్యాలలోనే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ లోని శ్రీనివాస నర్సింగ్‌హోంలో ఇద్దరు, లైఫ్‌లైన్ హాస్పిటల్‌లో నలుగురు, ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకరు, కాగజ్‌నగర్ విజేత హాస్పిటల్‌లో ఒకరు, వాంకిడి ఆస్పత్రిలో 14 మొత్తం35 మంది విద్యార్థినులు చికిత్సలు పొందుతున్నారు. విద్యారులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నందున భయందోళనకు గురవుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్తున్నారు. విద్యార్థినులు ఇంటిబాట పట్టడంతో మొత్తం 591మంది విద్యార్థినులకు గాను కేవలం 120మంది విద్యార్థినులు మాత్రమే పాఠశాలలో ఉన్నారు. పాఠ శాలలో విద్యార్థినుల అనారోగ్యాకిని కారణాలు తెలియక విద్యా ర్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశా లలో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికా రులు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యం విషమంగా ఉన్న విద్యా ర్థినులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలుతీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే
వాంకిడి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): వాంకిడి ఆశ్రమ పాఠశాలలో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై మంచిర్యాలలోని మ్యాక్సీకేర్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆదివారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి త్వరలోనే కోలుకునేలా చికిత్సఅందించాలని వారికు సూచించారు. ఎమ్మెల్యే వెంట మంచిర్యాల జిల్లా డీడీ గంగారాం, హెచ్‌ఎంలు శ్రీనివాస్, లక్ష్మణ్ ఉన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 10:46 PM