ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌ డివిజన్‌లో రెండు పులులు

ABN, Publish Date - Dec 06 , 2024 | 10:43 PM

సిర్పూర్‌(టి), డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ డివిజన్‌లో రెండు పులులు తిరుగుతున్నాయని తెలంగాణ పీసీసీఎఫ్‌(ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జ ర్వేటర్‌ ఆఫ్‌ఫారెస్ట్‌) చీఫ్‌ ఆర్‌ ఎమ్‌ డోబ్రియాల్‌ అన్నారు.

- రాష్ట్ర పీసీసీఎఫ్‌ చీఫ్‌ ఆర్‌ఎమ్‌ డోబ్రియాల్‌

సిర్పూర్‌(టి), డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ డివిజన్‌లో రెండు పులులు తిరుగుతున్నాయని తెలంగాణ పీసీసీఎఫ్‌(ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జ ర్వేటర్‌ ఆఫ్‌ఫారెస్ట్‌) చీఫ్‌ ఆర్‌ ఎమ్‌ డోబ్రియాల్‌ అన్నారు. శుక్రవారం తెలంగాణ- మహా రాష్ట్ర సరిహద్దులోగల సిర్పూ ర్‌(టి)మండలంలోని హుడ్కిలి, జక్కాపూర్‌, మాకిడి సరిహద్దు లో పులలు సంరక్షణ, మను షుల ప్రాణరక్షణ తదితర అంశాలపై మహారాష ్ట్రప్రభుత్వం, అటవీశాఖ అధికారులు అనుసరిస్తున్న విధివిధానాలపై కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడోబా పులల సంరక్షణ అభయారణ్యంలో త్వరలో పర్యటిస్తామని అన్నారు. డివిజన్‌లో తిరిగే పులులు పదిరోజులక్రితం కాగజ్‌నగర్‌ మండలం లోని నజ్రుల్‌నగర్‌లో ఓ మహిళను హతమార్చ డం, సిర్పూర్‌(టి) మండలం దుబ్బగూడలో సురేష్‌ అనేవ్యక్తిని గాయపర్చడం చేసిందన్నారు. ఇదే క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖాధికారులు అనుసరిస్తున్న విధానాలు, పులుల కదిలికలు, వాటి సంతానోత్పత్తికి తీసుకో వాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. తాము రెండు రోజుల్లో తడోబా అభయారణ్యంలో తప్పకుండా పర్యటిస్తామన్నారు. అనంతరం మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లా డీఎఫ్‌వో అవదుత్‌వార్‌, దాబా ఎఫ్‌ఆర్వో గౌడ్‌కార్‌తో అక్కడి వన్యప్రాణుల సంర క్షణపై చర్చించారు. సిర్పూర్‌(టి)రేంజ్‌ పరిధి లోని ఇటిక్యాలపహాడ్‌ గ్రామంలో అటవీశాఖ నర్సరీని పరిశీలించారు. మొక్కలు ఏపుగా ఎదిగే విధంగా సంరక్షించాలన్నారు. అలాగే చీలపల్లి, మెట్‌పల్లి, రావన్‌పల్లి గ్రామాల్లో పర్యటించి పులి కదిలికలపై భాగంగా పులిఅడుగులను గుర్తిం చారు. సిర్పూర్‌(టి) రేంజ్‌లోని వెంపల్లి సమీపం లో ఏర్పాటు చేసిన టవర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా అటవీశాఖాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలుసూచనలు, సల హాలు ఇచ్చారు. ఆయనవెంట రాష్ట్ర వైల్డ్‌లైఫ్‌ పీసీసీఎఫ్‌ చైర్మన్‌ ఏలుసింగ్‌ మేరు, ఎఫ్‌డీవో నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌, కాగజ్‌నగర్‌ డీఎఫ్‌వో శాంతారాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 10:43 PM