Kumaram Bheem Asifabad: ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్
ABN, Publish Date - Nov 18 , 2024 | 10:34 PM
ఆసిఫాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపా లన విజయోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వ హించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపా లన విజయోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వ హించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి హాజరై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న అభి వృద్ధిపనులు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన గార్యంటీపథకాలైన మహాలక్ష్మి, మహిళ లకు ఉచితబస్సు, గృహజ్యోతి, చేయూత పెన్షన్, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగ నియమకా లపై ఈనెల19నుంచి డిసెంబరు 7వరకు తెలం గాణ సాంస్కృతిక సారధి కళాకారులతో కార్యక్ర మాలు చేపడతామని తెలిపారు. ప్రతి మండల కేంద్రంతోపాటు ఆమండలాల్లోని రెండు గ్రామా ల్లో కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. గ్రామ స్థాయిలో అన్నిశాఖల ఉద్యోగులు, ప్రజా ప్రతి నిధులు, మహిళాసంఘాల సభ్యులు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. ఈనెల23న జిల్లా కేంద్రంలో 80మంది కళాకారులతో కూడిన సాంస్కృతికబృందంతో నిర్వ హించే సాంస్కృతిక కార్యక్రమాలకు అనువైనప్రదేశాన్ని గుర్తించి పూర్తి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లా అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో ప్రజాపాలన విజియోత్సవా లను విజయవంతం చేయాలని తెలిపారు.
ప్రతికుటుంబం మరుగుదొడ్లు కలిగి ఉండాలి..
జిల్లాలోని ప్రతికుటుంబం వ్యక్తిగత మరుగు దొడ్లు కలిగి ఉండాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లా, జిల్లా అధికారులతో కలిసి ప్రపంచ టాయిలెట్స్‌డే వాల్‌పోస్టర్లను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతికుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, బహిరంగ మలమూత్ర విసర్జనరహిత జిల్లాగా తీర్చిది ద్దాలని తెలిపారు. స్వచ్చభారత్ మిషన్‌గ్రామీణ్‌లో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉండేలా అందరం భాగస్వామ్యం అవుదామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎస్‌బీఎం జిల్లా సమన్వయకర్త నజర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 18 , 2024 | 10:34 PM