ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:04 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్స వాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్స వాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి జిల్లాఅధికారులతో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల నిర్వహణపై సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాలను డిసెం బరు1నుంచి 9వరకు ఘనం గా నిర్వహించాలని తెలి పారు.

డిసెంబరు1న విద్యా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేయాలని, సీఎం కప్‌ ఆటల పోటీల నిర్వహణ చర్యలు తీసుకోవాలని తెలి పారు. 2నజిల్లాలో ట్రాన్స్‌ జెండర్స్‌కొరకు క్లినిక్‌ ప్రారంభించేందుకు ఏర్పా ట్లు చేయాలని, 3న మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయాలను విద్యుత్‌ దీపకాం తులతో అలంకరించాలని, వైద్యపరీక్షలు, కంటి పరీక్షల శిబిరాలు నిర్వహించాలని, పారిశుధ్య కార్మికుల రక్షణకిట్లు, పీపీఈ కిట్లు పంపిణీ చేయాలని, మున్సిపల్‌ పరిధిలో సంవత్సరంలో చేట్టిన పనుల జాబితా ప్రదర్శించాలని తెలిపారు. 4న పెద్దపల్లిజిల్లాలో జరిగే కార్యక్రమాలలో గ్రూపు-4ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియా మకపత్రాలు అందజేస్తామన్నారు. 5న జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళాశక్తికేంద్రాల వద్ద, 6నజిల్లాలో గృహ జ్యోతి ద్వారా జీరో కరెంటు బిల్లులపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 7న మున్సి పాలిటీ, పంచాయతీలలో ప్రజాపాలన విజ యోత్సవాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 8న వివిధశాఖల ద్వారా కార్యక్రమాలు, 9న హైదరాబాద్‌లో జరిగే ప్రజాబహిరంగ సభలో జిల్లా నుంచి రెండు వందల మందిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి కార్యాలయంలో సంవత్సరం పూర్తైన సందర్భంగా లోగోలు ఉంచాలని, సంవత్సరంలో సాధించిన లక్ష్యాలు, చేపట్టిన పనుల నివేదికలను శనివారంలోగా శాఖల వారీగా ముఖ్య ప్రణాళిక అధికారికి అందించాలని తెలిపారు.

Updated Date - Nov 29 , 2024 | 11:04 PM