ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: స్థానికసంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి

ABN, Publish Date - Nov 10 , 2024 | 10:44 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు అరుణ్‌కుమార్‌ అన్నారు.

- బీజేపీ రాష్ట్ర నాయకుడు అరుణ్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు అరుణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యశాల సమావే శంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి పదినెలలు దాటినా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీప్రజల మన్నన లను పొందుతూ గతఅసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో 8ఎమ్మెల్యేలు, 8ఎంపీలను గెలుపొందిం దన్నారు. జిల్లాలో బీజేపీ60వేలకు పైగా సభ్యత్వాలను పూర్తిచేయడం సంతోషంగా ఉందన్నారు. స్థానికఎన్నికల అధికారులు, ఉప రిటర్నింగ్‌ అధికారులు, మండల ఇన్‌చార్జిలను నియమించారు. సమావేశంలో నాయకులు అమర్‌సింగ్‌ తిలావత్‌, సతీష్‌బాబు, కిరణ్‌, సత్యనారాయణ, అరుణ్‌కుమార్‌ లోయ, ప్రభాకర్‌గౌడ్‌, మనోహర్‌గౌడ్‌, మల్లయ్య, శంకర్‌, సొల్లు లక్ష్మి, కోవవిజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 10:44 PM