ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: చేనేతకు కావాలి చేయూత

ABN, Publish Date - Dec 06 , 2024 | 10:49 PM

కాగజ్‌నగర్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): చేనేతకు ఆదరణ కరువవుతోంది. గతమెంతో ఆదరణ పొందినప్పటికీ వర్తమానంలో ఒక్కసారిగా చేనేత వస్ర్తాలకు క్రేజీ తగ్గిపోయింది.

-కష్టాల కడలిలో చేనేత కార్మికులు

-చేనేత ఉత్పత్తులకు కరువవుతున్న ఆదరణ

-మూడునెలలుగా అందని చేనేత పెన్షన్‌

-దయనీయస్థితిలో కార్మికులు

కాగజ్‌నగర్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): చేనేతకు ఆదరణ కరువవుతోంది. గతమెంతో ఆదరణ పొందినప్పటికీ వర్తమానంలో ఒక్కసారిగా చేనేత వస్ర్తాలకు క్రేజీ తగ్గిపోయింది. దీంతో చేనేత కార్మికులు దయనీయ స్థితిలో కాలం వెల్లదీస్తున్నారు. చేనేత కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది. ఆదరణ లేక వీటి ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గటంతో చేనేతకేంద్రాలు కుదేలయ్యాయి. నెలకు 1500మీటర్ల ఖాదీ దుస్తులు తయారుచేసే కేంద్రాలు ఆదరణ లేక మూతబడ్డాయి. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యామ్నాయంగా దుప్పట్లు, బెడ్‌షీట్‌లు తయారీ చేసి అమ్ముతున్నారు. కాగజ్‌నగర్‌ పరిధిలో చేనేతే సహకార సంఘం నడుస్తోంది. ఈ సంఘంలో 23మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి సగటు నెలకు రూ.5వేల ఆదాయం దాటని స్థితి ఉంది. ఒక వైపు పెరుగుతున్న ధరలు మరోవైపు చాలీచాలని పీస్‌వర్క్‌ రేటుతో దయనీయంగా కాలం వెళ్లదీస్తున్నారు. అనారోగ్యం బారిన పడితే కనీసం మందులకు కూడా డబ్బులు సరిపోని పరిస్థితి. పరిస్థితిని గమనించిన గత ప్రభుత్వం వీరికి రూ.2చేనేత పెన్షన్‌ మంజూరు చేసింది. మూడు నెలల నుంచి తమకు ఆ పెన్షన్‌ కూడా రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. చేసేది లేక కూలీ పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాము తయారు చేసిన బెడ్‌ షీట్స్‌, దుప్పట్లు ప్రభుత్వ హాస్టళ్లలో వాడుతున్నట్టు తెలిపారు. చేనేత తయారీ కేంద్రంలో పనిచేసే కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు దుప్పట్లు తయారు చేస్తే ఒక్కొక్కరికి రూ.200కూడా గిట్టుబాటు కావటం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఒకవైపు పెరుగుతున్న ధరలు, మరోవైపు చేనేత రంగం ఉత్పత్తులకు మార్కెట్‌లో ధర లేకపోవటంతో ఒక్కసారి సంక్షోభానికి దారి తీసింది. ఈ సంఘంలో తయారు చేసిన దుప్పట్లు, ఇతరత్రా అన్నీ కూడా గతంలో ఆప్కో ద్వారా కొనుగోలు చేసి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులకు సరఫరా చేసేవారు. ప్రభుత్వం కూడా ఇందులో పని చేసే కార్మికులకు ప్రత్యేకంగా క్వార్టర్లను కేటాయించింది. ఈ క్వార్టర్లు కనీసం నివాస యోగ్యంగా కూడా లేవు. కష్టాల కడలిలో కాలం వెళ్లదీస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, పింఛన్‌ రెగ్యులర్‌గా వచ్చేలా చేయాలని కార్మికులు కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి..

-రాజమౌలి, కార్మికుడు, కాగజ్‌నగర్‌

నేను ఈ కేంద్రంలో రోజుకు మూడు బెడ్‌షీట్స్‌ తయారు చేస్తాను. రోజుకు రూ.300దాటని పరిస్థితి ఉంటుంది. వీటితో కుటుంబ పోషణ గడవదు. దయనీయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్నాను. చేనేత పెన్షన్‌ కూడా రావటం లేదు. అధికారులు స్పందిందించి తమను ఆదుకోవాలి.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా..

-తాళ్ల రాజయ్య, కార్మికుడు, కాగజ్‌నగర్‌

మాకు గతంలో చేనేత పెన్షన్‌ వచ్చేది. మూడు నెలలుగా రావటం లేదు. పీస్‌ వర్క్‌ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాను. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుంది. పెరిగిన ఽధరలకు అనుగుణంగా కూలీ పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

సమస్యలను పరిష్కరించాలి..

-కనకయ్య, కార్మికుడు, కాగజ్‌నగర్‌

చేనేత కేంద్రంలో కూలీలు పీస్‌వర్క్‌ చేస్తున్నప్పటికీ జీతాలు సరిపోవడం లేదు. జీతాలు పెంచితే తమకు కాస్త ఊరట లభిస్తుంది. ఈ విషయంలో అధికారులు, నాయకులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలి. చేనేత పెన్షన్‌ కూడా నిలిచిపోయింది. అది వచ్చేలా చూడాలి.

Updated Date - Dec 06 , 2024 | 10:49 PM