ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bhim Asifabad: ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Nov 16 , 2024 | 09:59 PM

కాగజ్‌నగర్‌, నవంబరు 16(ఆంధ్ర జ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

కాగజ్‌నగర్‌, నవంబరు 16(ఆంధ్ర జ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శనివారం కాగజ్‌ నగర్‌ మండలం సీతానగర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి, కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధాశుక్లాతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, టార్పాలీన్‌ కవర్లు, గన్ని సంచులు అందు బాటులో ఉంచాలన్నారు. నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు. సన్నరకంకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్‌ ఇస్తుందన్నారు. సన్నరకం ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంద న్నారు. అనంతరం కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆది, సోమవారాల్లో నిర్వహించనున్న గ్రూపు-3 పరీక్షా కేంద్రాలను తనిఖీచేశారు. పట్టణంలోని ఫాతీమా కాన్వెంట్‌ పరీక్షాకేంద్రాన్ని సందర్శించి గదులు, పరిస రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షగదుల్లో ఫర్నీచర్‌, ఫ్యాన్లు, వెలుతురు సరిగ్గా ఉండే లా చూసుకోవాలని చీఫ్‌ సూపరింటెండెంట్‌ను ఆదే శించారు. అనంతరం కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని ఈద్గాకాలనీలో కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బం దీగా చేపట్టాలన్నారు. ఎన్యూమరేటర్లు తమకు కేటాయిం చిన బ్లాక్‌లలో ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ వివరాలను నిర్ణీత నమూనాలలో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. ఆయనవెంట జిల్లా సహకార అధికారి రబ్బాని, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మనో హర్‌, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, తహ సీల్దార్‌ కిరణ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 09:59 PM