ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముసురు వాన

ABN, Publish Date - Jul 24 , 2024 | 10:53 PM

జిల్లాలో ముసురు వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం నుంచి మొదలైన వర్షం బుధవారం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 23.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హాజీపూర్‌ మండలం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 8,600 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు, ఓబీ మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి.

మంచిర్యాల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ముసురు వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం నుంచి మొదలైన వర్షం బుధవారం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 23.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కన్నెపల్లి మండలంలో 34.2 మిల్లీమీటర్లు, వేమనపల్లి 34.0, నెన్నెల 31.7, భీమారం 28.9, జన్నారం 28.1, చెన్నూరు 26.9, దండేపల్లి 24.2, కోటపల్లి 24.1, కాసిపేట 23.4, మందమర్రి 23.1 మిల్లీమీటర్లు, భీమిని, బెల్లంపల్లి మండలాల్లో 23.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

హాజీపూర్‌ మండలం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 8,600 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 148 మీటర్లకు ప్రస్తుతం 145.07 మీటర్ల ఎత్తుకు నీళ్లు చేరుకున్నాయి. ప్రాజెక్టు సామ ర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.797 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.

ఓసీల్లో ముందుకు సాగని బొగ్గు ఉత్పత్తి

వారం రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు, ఓబీ మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. మూడు ఏరియా ల్లోని శ్రీరాంపూర్‌, ఇందారం, రామకృష్ణాపూర్‌, మందమర్రి, గోలేటి, కైరిగూడ ఓసీపీల్లో ఏడు రోజుల్లో దాదాపు రూ.45.5 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా, రూ.14 కోట్ల విలువైన ఓబీ మట్టి వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోంది.

బెల్లంపల్లి: పాత బెల్లంపల్లికి చెందిన గెల్లి వంశీ ఇల్లు వర్షానికి కూలిపోయింది. ఇల్లు కూలుతున్న సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రూ.50 వేలకు పైగా ఆస్తినష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వ సహాయం అందించి ఆదుకోవాలని కోరాడు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పరిశీలించి ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షంతో పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్లపై నీరు నీలిచింది.

పరవళ్ళు తొక్కుతున్న గోదావరి

దండేపల్లి: గూడెం గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో గూడెం పాత లోలెవల్‌ వంతెన నీట మునగడంతోపాటు పుష్కర్‌ఘాట్‌, శనేశ్వరస్వామి ఆలయం నీట మునిగింది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ద్వారా గోదావరి నదికి వరద నీరు రావడంతో గోదావరి నది పరవళ్లు తోక్కుతోంది.

Updated Date - Jul 24 , 2024 | 10:53 PM

Advertising
Advertising
<