ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tiger Terror: కొమురం భీం జిల్లా లో టైగర్ టెర్రర్..

ABN, Publish Date - Nov 29 , 2024 | 10:38 AM

కొమురం భీం: జిల్లాలో టైగర్ టెర్రర్.. పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో అటవీ గ్రామాల్లో భయాందోళన నెలకొంది. నాలుగేళ్లలో పులుల దాడిలో నలుగురు మృతి చెందారు. తాజాగా పులి దాడిలో మహిళ మృతి చెందింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.

కొమురం భీం: జిల్లాలో టైగర్ టెర్రర్ (Tiger terror).. పులి దాడిలో ఓ మహిళ మృతి (Woman mies) చెందింది. దీంతో అటవీ గ్రామాల్లో భయాందోళన నెలకొంది. నాలుగేళ్లలో పులుల దాడిలో నలుగురు మృతి చెందారు. మహారాష్ట్ర నుంచి పులుల రాక పెరిగింది. జనావాసాలకు దగ్గరగా పులులు తిరుగుతున్నాయి. తాజాగా పులి దాడిలో మహిళ మృతి చెందింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మృతురాలు గన్నారం వాసి మోర్లే లక్ష్మిగా గుర్తించారు. కాగజ్ నగర్ మండలం, నజ్రుల్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. మహిళ వ్యవసాయ పనులకు వెళ్తుండగా పులి దాడి చేసింది. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడున్నవారు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.


కాగా నిర్మల్ జిల్లా (Nirmal Dist.,) ఖానాపూర్ (Khanapur) ప్రాంతంలో పెద్ద పులి (Tiger) సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పులి దాడి చేసే ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియా (Social Media) వేదికగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా పులి దర్జాగా రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడింది. దీంతో వాహనదారులు పులిని సెల్ ఫోన్లతో ఫోటోలు తీసారు. ఈ క్రమంలో అటవీ అధికారులు (Forest Officers) దిమ్మదుర్తి సుర్జాపూర్, మాస్కాపూర్, ఎక్బాల్ పూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

కాగా పెద్దపులి సంచారం నేపథ్యంలో ఫారెస్ట్‌ అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఖానాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఒంటరిగా ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని, సాయంత్రం త్వరగా ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని బంధించాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

దర్జాగా రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడ్డ పులి

ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

తీరంలో కనకం వేట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 29 , 2024 | 01:14 PM