ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకోవాలి

ABN, Publish Date - Apr 09 , 2024 | 10:22 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి రూరల్‌ సీఐ అఫ్జలుద్దీన్‌ అన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ఇష్టమైన నాయకుడికి ఓటువేయలని కోరారు. మంగళవారం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

నెన్నెల, ఏప్రిల్‌ 9: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి రూరల్‌ సీఐ అఫ్జలుద్దీన్‌ అన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ఇష్టమైన నాయకుడికి ఓటువేయలని కోరారు. మంగళవారం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కుశ్నపల్లి, కొత్తూరు ప్రజలతో సమావేశమై మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు తోడ్పాటునందిచాలని కోరారు. ఎన్నికల సమయంలో గొడవలకు దిగినవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీ-విజిల్‌ యాప్‌ గూర్చి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి ఉల్లంఘనలు, ఎన్నికల్లో అవకతవకలు జరిగితే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాంబ్‌ స్క్వాడ్‌తో కల్వర్టులు, బ్రిడ్జీలను పరిశీలించారు. హెచ్‌సీ విజయ్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 09 , 2024 | 10:22 PM

Advertising
Advertising