ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మేడారానికి గాలిమోటార్లోనూ..

ABN, Publish Date - Feb 19 , 2024 | 06:10 AM

మేడారం మహా జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? రోడ్డు, రైలు మార్గాల ద్వారా ట్రాఫిక్‌, రద్దీని తట్టుకొని గంటలకొద్దీ ప్రయాణం అని జంకుతున్నారా?

21 నుంచి 25 వరకు హెలికాప్టర్‌ సేవలు.. 95,833తో హైదరాబాద్‌ నుంచి వెళ్లిరావొచ్చు

హనుమకొండ నుంచైతే రూ.28,999

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మేడారం మహా జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? రోడ్డు, రైలు మార్గాల ద్వారా ట్రాఫిక్‌, రద్దీని తట్టుకొని గంటలకొద్దీ ప్రయాణం అని జంకుతున్నారా? కాస్త ఖర్చుకు వెనుకాడకపోతే.. ఈ ఇబ్బందులేవీ లేకుండా మేడారానికి అట్టే వెళ్లి.. ఇట్టే రావొచ్చు! వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం మేడారానికి వెళ్లాలనే భక్తుల కోసం హెలికాప్టర్‌ సేవలూ అందుబాటులోకొచ్చాయి. హెలిటాక్సీ సంస్థ తెలంగాణ ప్రభుత్వం, బెంగళూరుకు చెందిన తుంబీ ఏవియేషన్‌ సహకారంతో హెలికాప్టర్‌ సేవలను అందించేందుకు సిద్ధమైంది. జాతర మొదలయ్యే ఈనెల 21 నుంచి 25వ తేదీ దాకా హెలికాప్టర్‌ సేవలు అందించనుంది. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌, ములుగు, మేడారానికి వెళ్లే దార్లు ట్రాఫిక్‌తో నిండిపోతున్నాయి. హనుమకొండ నుంచే రోడ్డు మార్గం ద్వారా మేడారానికి వెళ్లేందుకు 4-5 గంటలు పడుతుండటంతో జాతరకు త్వరగా వెళ్లి రావాలనుకునే భక్తు లు హైదరాబాద్‌, హనుమకొండ నుంచి ఈ హెలికాప్టర్‌ సేవలు వినియోగించుకోవచ్చు. అలాగే అక్కడ 7 నిమిషాల పాటు ఆకాశం నుంచి జాతరను వీక్షేందుకు ‘జాయ్‌రైడ్‌’ను కూడా హెలిటాక్సీ ఏర్పాటు చేసింది. టికెట్ల వివరాలను ఆ సంస్థ ఆదివారం వెల్లడించింది. హనుమకొండ- మేడారం-హన్మకొండ షటిల్‌ సర్వీసుల్లో ఒక్కరికి రూ.28,999 టికెట్‌ ధర ఉంది.

ఈ ప్రయాణంలో భక్తులు హనుమకొండ నుంచి బయలుదేరి మేడారానికి హెలికాప్టర్‌లో దిగొచ్చు. అక్కడ వీఐపీ దర్శనం అనంతరం తిరిగి హనుమకొండలో దింపుతారు. 20 నుంచి 30 నిమిషాల్లో హనుమకొండ నుంచి మేడారానికి తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే మేడారంలో ఏరియల్‌ వ్యూ (జాయ్‌రైడ్‌) కింద 7 నిమిషాలపాటు గాలిలో తిప్పేందుకు ఒక్కొక్కరికి రూ.4,300 తీసుకుంటారు. హైదరాబాద్‌ నుంచి మేడారానికి కూడా ప్యాకేజీని ప్రకటించారు. ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన చాపర్‌లో ఒక్కరికి రూ.95,833 టికెట్‌ ధర ఉందని సంస్థ వెల్లడించింది. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌ను నడిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గిగిగి.ఏఉఔఐఖీఅగీఐఐ.ఇౖక వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చునని, వివరాలకు 74834-32752, 94003-99999 నంబర్లలో సంప్రదించవచ్చుని సంస్థ తెలిపింది.

Updated Date - Feb 19 , 2024 | 07:30 AM

Advertising
Advertising