ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

23వ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహం లభ్యం

ABN, Publish Date - Apr 10 , 2024 | 11:56 PM

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నెమిల గ్రామంలో జైనమత తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌, బృందం సభ్యుడు కుండె గణేష్‌ తెలిపారు.

రాజాపేట, ఏప్రిల్‌ 10: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నెమిల గ్రామంలో జైనమత తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌, బృందం సభ్యుడు కుండె గణేష్‌ తెలిపారు. బుధవారం నెమిల గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నెమిల గ్రామంలోని హనుమాన్‌ ఆలయం వద్ద అసంపూర్తిగా ఉన్న విగ్రహం గుర్తించి స్థానికులు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. ఆ మేరకు విగ్రహాన్ని పరిశీలించామని జైన ధర్మానికి చెందిన 23వ తీర్థంకరుడి విగ్రహంగా గుర్తించామని, 22వ జైన తీర్థంకరుడైన నేమినాథుడి పేరుమీదనే నెమిల గ్రామం వెలిసిందని ఆయన వివరించారు. ఈ ప్రాంతమంతా జైన వసతులతో అలరాడేదని, కొలనుపాక, రఘునాథపురం, సైదాపురం కొల్లూరు గ్రామాల్లో లభించిన శిల్పాలే ఇందుకు సాక్ష్యమన్నారు. నెమిలలో గుర్తించిన శిల్పం పార్శ్వనాథుడి వెనుక భాగాన చుట్టలు తిరిగిన 7 తలల సర్పం ఉన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, దాని ఆధారంగా పార్శ్వనాథుడిగా గుర్తించామన్నారు. రాష్ట్ర కూట శైలిలో చెక్కబడిందని వివరించారు.

Updated Date - Apr 11 , 2024 | 08:09 AM

Advertising
Advertising