ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: అయ్య బాబోయ్.. తెలంగాణలో భర్తలను భార్యలు ఇంతలా చితక్కొడుతున్నారా?

ABN, Publish Date - Mar 02 , 2024 | 10:44 AM

‘వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా..’ అన్నాడో సినీ కవి. పెళ్లికి ముందు ఉన్నట్టు.. పెళ్లి తర్వాత ఉంటామంటే కుదరదు. అలవాట్లు మార్చుకోవాలి. అవసరమైతే అగచాట్లు పడాలి. బాధ్యతలు వచ్చి మీద పడతాయి. రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆలోచించాలి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే.. వీరికి బోలెడన్ని కండీషన్స్. భర్త అడుగు జాడల్లో నడవాలి. అత్తామామ చెప్పినట్టుగా వినాలి. ఇంటి పని.. వంట పని సవ్యంగా చేయాలి. కానీ ఇదంతా ఆ రోజుల్లో గురూ.. పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి.

హైదరాబాద్: ‘వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా..’ అన్నాడో సినీ కవి. పెళ్లికి ముందు ఉన్నట్టు.. పెళ్లి తర్వాత ఉంటామంటే కుదరదు. అలవాట్లు మార్చుకోవాలి. అవసరమైతే అగచాట్లు పడాలి. బాధ్యతలు వచ్చి మీద పడతాయి. రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆలోచించాలి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే.. వీరికి బోలెడన్ని కండీషన్స్. భర్త (Husband) అడుగు జాడల్లో నడవాలి. అత్తామామ చెప్పినట్టుగా వినాలి. ఇంటి పని.. వంట పని సవ్యంగా చేయాలి. కానీ ఇదంతా ఆ రోజుల్లో గురూ.. పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. పెళ్లవగానే వేరు కాపురం.. భార్య (Wife) అడుగు జాడల్లోనే ఇప్పుడు భర్త నడవాలి. లేదంటే అప్పడాల కర్ర తిరగేసి మరీ లైన్‌లో పెడుతున్నారు.

‘తాజాగా భార్యల చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తలు’ అనే అంశంపై సర్వే జరిగింది. బయో సోషల్ స్టడీస్ (Bio Social Studies) అనే సర్వే సంస్థ దీనిని నిర్వహించింది. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఈ సర్వే (Survey)లో ఆసక్తికర విషయమొకటి వెలుగు చూసింది. ఇలా భార్యల చేతిలో చావు దెబ్బలు తింటున్న భర్తలు తెలంగాణ (Telangana)లోనే ఎక్కువట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చావుదెబ్బలు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులే ఎక్కువని తేలింది. భారత్‌ (India)లో పురుషులకు రక్షణ చట్టాలు లేకపోవడమే కారణమని అధ్యయనం తేల్చింది. గతంతో పోల్చుకుంటే భార్యల చేతిలో దెబ్బలు తింటున్న వారి సంఖ్య ఇప్పుడు రెట్టింపైందట.

తెలంగాణలో టాక్స్ పేయర్స్ సంఖ్య అదేనండి.. తాగుబోతుల సంఖ్య చాలా ఎక్కువే. పుట్టుక నుంచి చావు వరకూ.. అకేషన్ ఏదైనా సరే.. మందు ఉండాల్సిందే. ఇక తాగేసి కుటుంబాన్ని పట్టించుకోకపోగా.. అప్పులు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారట. మరి ఇదంతా చూస్తూ భార్యలు ఊరుకుంటారా? ఉతికి ఆరేస్తున్నారట. గత 15 ఏళ్లలో భార్తలపై దాడులు చేస్తున్న వారి సంఖ్య ఆరు రెట్లు పెరిగిందట. 2006లో ఆరుగురు మహిళలు మాత్రమే భర్తలపై చేయి చేసుకునే వారట. ఇప్పుడు ఆ సంఖ్య 36కి పెరిగిందట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 10:57 AM

Advertising
Advertising