వన్యప్రాణులు, ప్రకృతిపై అవగాహన కల్పించాలి
ABN, Publish Date - Oct 01 , 2024 | 11:28 PM
విద్యార్థులకు వన్యప్రాణులు, ప్రకృతి పట్ల అవగాహన చాలా ముఖ్యమని కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్
కొడంగల్/బొంరా్‌సపేట్ /వికారాబాద్, అక్టోబరు 1 : విద్యార్థులకు వన్యప్రాణులు, ప్రకృతి పట్ల అవగాహన చాలా ముఖ్యమని కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. మంగళవారం జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని హైస్కూళ్ల విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. చిన్నప్పటినుంచే పిల్లలకు ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణ గురించి తెలియజేయాలని, అది భవిష్యత్తు తరాలకు చాలా అవసరమని తెలిపారు. డీఎ్‌ఫవో జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ. మనిషి ప్రకృతిలో భాగం కాబట్టి ప్రకృతిని సంరక్షించినప్పుడే మానవుడు కూడా సంరక్షించబడుతాడని తెలిపారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు త్వరితగతిన పూర్తి చేస్తాం
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీఎస్ శాంతికుమారి హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీక్‌జైన్ కొడంగల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం పరిశీలించారు. ఎంపీయూపీఎస్ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ట్రైబల్ గురుకుల పాఠశాల అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అదే విధంగా బొంరా్‌సపేట్ మండలంలోని సూర్యనాయక్ తండా, జానకంపల్లి, తుంకిమెట్ల గ్రామాల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, అమ్మఆదర్శ పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం గురించి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఉషశ్రీ, వెంకన్నగౌడ్, నాయకులు మల్లికార్జున్, ఆంజనేయులు, రాములు తదిత
Updated Date - Oct 01 , 2024 | 11:28 PM