Medak: డప్పు కొట్టకుంటే సామాజిక బహిష్కరణ చేస్తారా?
ABN, Publish Date - Sep 17 , 2024 | 04:02 AM
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజీగూడ గ్రామంలో ఉన్నత చదువులు చదివిన దళిత యువకులు చంద్రం, అర్జున్‌లు తమ కులవృత్తి అయిన డప్పు కొట్టడాన్ని ఆపుతామన్నందుకు.. ఆ గ్రామ పెత్తందారులు వారిని సామాజిక బహిష్కరణ చేయడం దుర్మార్గమైన చర్య అని జై భీమ్ సేన ఫైర్ రైట్స్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పి. బల్వంత్‌రావు పేర్కొన్నారు.
పెత్తందారులపై అట్రాసిటీ కేసులు పెట్టి అరెస్టు చేయాలి
జై భీమ్ సేన ఫైర్ రైట్స్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు
నల్లకుంట, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజీగూడ గ్రామంలో ఉన్నత చదువులు చదివిన దళిత యువకులు చంద్రం, అర్జున్‌లు తమ కులవృత్తి అయిన డప్పు కొట్టడాన్ని ఆపుతామన్నందుకు.. ఆ గ్రామ పెత్తందారులు వారిని సామాజిక బహిష్కరణ చేయడం దుర్మార్గమైన చర్య అని జై భీమ్ సేన ఫైర్ రైట్స్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పి. బల్వంత్‌రావు పేర్కొన్నారు.
డప్పులు కొట్టబోమన్నందుకు ఈ నెల 14న దళితులను సామాజిక బహిష్కరణ చేసిన పెత్తందారులపై క్రిమినల్, అట్రాసిటీ కేసులు పెట్టి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదర్‌గూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులతో తాము ఉద్యోగాలు చేస్తున్నామని, కులవృత్తి మానేస్తామని అన్నందుకు పంచాయతీ పెట్టి సామాజిక బహిష్కరణ చేయడం దారుణమని అన్నారు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు.
Updated Date - Sep 17 , 2024 | 04:03 AM