ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విధుల నుంచి ట్రిపుల్‌ ఐటీ సీఐ తొలగింపు

ABN, Publish Date - Nov 13 , 2024 | 06:26 AM

బాసర ట్రిపుల్‌ ఐటీ సీఐ (చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) రాకేశ్‌ను మంగళవారం సాయంత్రం విధుల నుంచి తొలగించారు.

  • ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై హత్యాయత్నం కేసులు

  • సెక్యూరిటీపై దాడి చేసిన ఏబీవీపీ కార్యకర్తలపైనా కేసులు

బాసర, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): బాసర ట్రిపుల్‌ ఐటీ సీఐ (చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) రాకేశ్‌ను మంగళవారం సాయంత్రం విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు పోలీసు శాఖ నుంచి ఉత్తర్వులు అందాయని యూనివర్సిటీ పరిపాలన అధికారి రణధీర్‌ తెలిపారు. విద్యార్థి ఆత్మహత్య తర్వాత నిరసన తెలిపేందుకు వచ్చిన ఏబీవీపీ విద్యార్థులపై సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో దాడి చేయడంతో పలువురికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పరిస్థితి కర్రలతో దాడుల వరకు వెళ్లిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనను పోలీసు అధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు. విచారించి దాడికి పాల్పడిన ఇద్దరు సెక్యూరిటీ గార్డ్‌లపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐని విధుల నుంచి తప్పించారు. అదేవిధంగా ట్రిపుల్‌ ఐటీ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన ఏబీవీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, మృతి చెందిన విద్యార్థి స్వాతిప్రియ తల్లి మనోవేదనతో బాసర ఎస్సై గణేష్‌ చొక్కా కాలర్‌ను పట్టుకున్న ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.

Updated Date - Nov 13 , 2024 | 06:26 AM