Bathukamma Sambaralu: వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ నిమజ్జనం
ABN, Publish Date - Oct 08 , 2024 | 09:17 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలు నేటితో ముగిశాయి. అందులోభాగంగా మంగళవారం సద్దుల బతుకమ్మను నిమ్మజ్జనం చేశారు. అందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే అంతకుముందు మున్సిపల్ కార్యాలయం నుంచి గౌరీ మాత అమ్మవారిని బతుకమ్మ ఘాట్ వరకు మున్సిపల్ పాలకవర్గం ఊరేగింపుగా తీసుకు వెళ్లింది.
వేములవాడ, అక్టోబర్ 08: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలు నేటితో ముగిశాయి. అందులోభాగంగా మంగళవారం సద్దుల బతుకమ్మను నిమ్మజ్జనం చేశారు. అందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే అంతకుముందు మున్సిపల్ కార్యాలయం నుంచి గౌరీ మాత అమ్మవారిని బతుకమ్మ ఘాట్ వరకు మున్సిపల్ పాలకవర్గం ఊరేగింపుగా తీసుకు వెళ్లింది.
Also Read: Kavita: చనిపోయిందనుకున్నారు.. ప్రియుడితో అడ్డంగా దొరికిపోయింది.. కవితా మజాకా
సంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క సైతం ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఇక వేములవాడలో కొలువు తిరిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు దర్శించుకున్నారు.
Also Read: South Central Railway: దసరా వేళ.. 770 ప్రత్యేక రైళ్లు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతాయి. అందరూ సద్దుల బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. కానీ వేములవాడలోని రాజన్న సన్నిధిలో మాత్రం ఏడు రోజులు మాత్రమే ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారు.
Also Read: బత్తాయి తింటే ఇన్ని లాభాలున్నాయా..?
ఇంతకీ ఏడు రోజులే ఎందుకు నిర్వహిస్తారంటే..?
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడలో శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కొలువు తీరి ఉన్నారు. ఈ వేములవాడలో ఏడు రోజులపాటే సద్దుల బతుకమ్మ పండగ నిర్వహిస్తారు. ఎందుకంటే.. పూర్వం ఓ రాజు తన కుమార్తె సంతోషం కోసం ఏడు రోజుల్లోనే సద్దుల బతుకమ్మ నిర్వహించారు. మళ్ళీ 9 రోజుల్లో సద్దుల బతుకమ్మ మెట్టినింట్లో జరుపుకునేందుకు వీలుగా శాసనం చేశాడు. నాటి నుంచి వేములవాడ పట్టణంలో ఏడు రోజుల్లోనే సద్దుల బతుకమ్మ వేడుకలు, పండగలు నిర్వహించుకుంటురని ఓ కథనం అయితే జనసామాన్యంలో ఉంది.
Also Read: Dasara Navaratri 2024: శరన్నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజు.. ఎప్పుడంటే..?
ఈ ఏడు రోజుల బతుకమ్మ జరుపుకోవడానికి మరొకటి ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఓ రాజు 100 మంది కుమారులను యుద్ధంలో కోల్పోయారు. అనంతరం ఆ రాజుకు లక్ష్మీ స్వరూపమైన బతుకమ్మ లక్ష్మీ అంశగా వచ్చింది. నాటి నుంచి ఏడు రోజుల్లోనే బతుకమ్మ పండుగ చేస్తున్నారని సమాచారం. తన కుమార్తె పుట్టింట్లో, మెట్టినింట్లో.. రెండు ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ పండుగ ఆనందంగా జరుపుకునేలా ఆ రాజు.. వేములవాడలో శాసనం చేశాడు. ఈ నేపథ్యంలోనే సద్దుల బతుకమ్మ మిగతా ప్రాంతాలతో పోలిస్తే వేములవాడలో ఏడు రోజుల్లోనే జరుపుకుంటారని స్థానికులు చెబుతారు.
Also Read: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2024: ఫలితాలు
For Telangana News And Telugu News
Updated Date - Oct 08 , 2024 | 09:41 PM