ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

ABN, Publish Date - Apr 07 , 2024 | 12:46 PM

లోక్‌సభ ఎన్నికల వేళ వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌ పార్టీకి (BRS) మరో బిగ్ షాక్ తగిలింది. భద్రాచలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌ పార్టీకి (BRS) మరో బిగ్ షాక్ తగిలింది. భద్రాచలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కీలక నేత, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావ్ గత రాత్రి (శనివారం) తక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలోనే రాహుల్ సమక్షంలోనే పార్టీలో చేరినప్పటికీ నేడు (ఆదివారం) సీఎం రేవంత్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కండువాను కప్పి సాదరంగా రేవంత్ ఆహ్వానించారు.

కాగా గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తెల్లం వెంకట్రావ్ మాత్రమే బీఆర్ఎస్ తరపున గెలిచారు. మిగతా 9 స్థానాల్లో కాంగ్రెస్ 8, సీపీఐ 1 స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.


ఇప్పటికే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు పలువురు ఎంపీలు, కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు బిగ్ షాక్..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 01:48 PM

Advertising
Advertising