5 కిలోల బంగారం రూ.221 కోట్ల ఆస్తులు
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:49 AM
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత కుటుంబానికి రూ.221,40,09,647 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం.. మాధవీలత వద్ద 3.9కిలోల బంగారు నగలు, ఆమె భర్త విశ్వనాథ్ వద్ద 1.1 కిలోల
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత బాగా రిచ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత కుటుంబానికి రూ.221,40,09,647 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం.. మాధవీలత వద్ద 3.9కిలోల బంగారు నగలు, ఆమె భర్త విశ్వనాథ్ వద్ద 1.1 కిలోల బంగారం ఉంది. విరించి ఆస్పత్రి, ఇతరత్రా అన్నీ కలిపి మాధవీలత పేరిట రూ.31.31 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. విరించి లిమిటెడ్, వివో బయోటెక్ సంస్థల్లో ఆమెకు షేర్లు ఉన్నాయి. కుటుంబసభ్యుల పేరిట రూ.165.47కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. అలాగే, మాధవీలత దంపతులకు రూ.55.92కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వీటిల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు, అపార్ట్‌మెంట్లు, ప్లాట్లు ఉన్నాయి. మాధవీలతకు రూ.90లక్షలు, ఆమె భర్త విశ్వనాథ్‌కు రూ.26.13 కోట్ల అప్పులు ఉన్నాయి.
‘కాసాని’ ఆస్తులు రూ.213.35 కోట్లు
చేవెళ్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబానికి రూ.213.35 కోట్ల్లు ఆస్తులు ఉన్నాయి. కాసాని పేరిట రూ132.35 కోట్లు, ఆయన భార్య చంద్రకళ పేరిట రూ.81కోట్ల విలువైన ఆస్తులున్నాయి. అలాగే ఆయన కుటుంబానికి రూ.15.12కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. కాసానికి రూ.30లక్షల అప్పులు ఉన్నాయి. జ్ఞానేశ్వర్ దంపతుల వద్ద 120 తులాల బంగారు ఆభరణాలున్నాయి. ఆయనపై ఓ క్రిమినల్ కేసు ఉంది.
ఆత్రం సుగుణపై 50 క్రిమినల్ కేసులు
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 50 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం..ప్రజా ఉద్యమంలో భాగంగా నమోదైన ఈ కేసులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఆత్రం సుగుణ వద్ద ఎలాంటి నగలు లేవు. సుగుణకు రూ.12.10 లక్షల విలువైన చరాస్తులు, ఆమె భర్త పేరిట రూ.42వేల విలువైన చరాస్తులు ఉన్నాయి. వారికి రూ.42.50 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. సుగుణకు రూ.23.49 లక్షలు, ఆమె భర్తకు రూ.29.76 లక్షల అప్పులు ఉన్నాయి.
నగేశ్ స్థిరచరాస్తులు రూ.1.62 కోట్లు
ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ తనకు రూ.1.62కోట్ల విలువైన స్థిరచరాస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన భార్య పేరిట రూ.24.79 లక్షల విలువైన చరాస్తులు ఉండగా కుమార్తె, కుమారుడు పేరిట సుమారు 11 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. వారి కుటుంబసభ్యులందరి వద్ద కలిపి 365గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆయనకు రూ.10.50లక్షల అప్పులు ఉండగా ఆయన కుమార్తె పేరిట రూ.18.51లక్షల రుణం ఉంది.
డీకే అరుణ ఆస్తి రూ.66.75 కోట్లు
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కుటుంబానికి రూ. 66.75కోట్లు ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం.. రూ. 26.47 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 40.27 కోట్ల స్థిరాస్తులు, 1.54కిలోల బంగారు ఆభరణాలు, 93 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. డీకే అరుణ దంపతుల పేరిట రూ.2.26 కోట్ల బ్యాంకు డిపాజిట్లు, పలు కంపెనీల్లో రూ.28.45లక్షల విలువైన షేర్లు, రూ.16.50లక్షల విలువైన పోస్టాఫీసు బాండ్లు ఉన్నాయి. అరుణ పేరిట రూ.25లక్షల విలువైన కారు ఉండగా, ఆమె భర్త పేరిట రూ.9.50 కోట్ల విలువైన 80 వాహనాలు ఉన్నాయి.
రూ.10 కోట్ల ఆస్తులు.. రెండు కోట్ల అప్పులు
మహబూబ్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివా్‌సరెడ్డికి రూ.10.83 కోట్ల ఆస్తులు, రూ.2.73 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయనకు రూ.3.39కోట్లు స్థిరాస్తులు, రూ. 7.44 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య గీతారెడ్డి పేరిట రూ.2.39 కోట్ల విలువ చేసి చరాస్తులు ఉన్నాయి. హిందూ అవిభాజ్య కుటుంబ ఆస్తి రూ.2.72 కోట్లు ఉంది.
మల్లు రవి ఆస్తి 52.32 కోట్లు
నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు రవి కుటుంబానికి రూ.52.32 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం.. రూ.26.49కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.25.82కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. మల్లు రవి దంపతుల వద్ద రూ.3.40లక్షల నగదు ఉంది. ఆయన కుటుంబానికి 870 గ్రాముల బంగారం, 10 గ్రాముల వజ్రాభరణాలు ఉన్నాయి కానీ సొంత వాహనం లేదు.
Updated Date - Apr 26 , 2024 | 05:49 AM