బీఆర్‌ఎస్ వల్లే విద్యుత్ చార్జీల పెంపుపై వెనక్కి
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:38 AM
ద్యుత్ చార్జీలు పెంచితే ఉద్య మం తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేయడంతో విద్యుత్ చార్జీల పెంపును కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
దేవరకొండ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్య మం తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేయడంతో విద్యుత్ చార్జీల పెంపును కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం విద్యుత్ చార్జీల పెంపును ఆపినందుకు ప్రజల తరుపున మాజీ సీఎం కేసీఆర్ ప్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వి హంచి ఆయన మాట్లాడారు. అంతకుముందు దేవరకొండలో ర్యాలీ నిర్వ హించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచేందుకు ప్రయత్నం చేస్తే బీఆర్‌ఎస్ అడ్డుకుందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. కార్యక్రవ ుంలో నాయకులు రవికుమార్, వేములరాజు, టీవీఎన్‌రెడ్డి, జానిబాబా పాల్గొన్నారు.
Updated Date - Oct 31 , 2024 | 12:39 AM