BRS MLA: సీఎం రేవంత్ రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్
ABN, Publish Date - Dec 01 , 2024 | 07:16 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి మరోసారి మండిపడ్డారు. రైతు బంధు అమలు చేయకుంటే.. రేవంత్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
నిజామాబాద్, డిసెంబర్ 01: తెలంగాణలోని రైతులకు రైతుబంధును ఎగ్గొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. అయితే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రైతుబంధు పథకం కింద రైతులకు నగదు ఇవ్వకుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని వేముల ప్రశాంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతు ప్రజలే చూస్తారన్నారు.
Also Read: ట్రంప్ నిర్ణయం.. మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు
రైతులను నిండుగా ముంచి..
ఆదివారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యంగ్యంగా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు. రైతులను నిండుగా ముంచి రైతు సంబరాలు, రైతు పండుగ అంటున్నాడంటూ రేవంత్ రెడ్డిని వ్యవహార శైలిని ఈ సందర్భంగా ఎండగట్టారు. రాష్ట్రంలో 31 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని.. కానీ కేవలం 24 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,79,000 మంది రైతులకు రుణమాఫీనే జరగలేదని తెలిపారు.
Also Read: ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ లేఖ
Also Read : తీరం దాటిన ఫెంగల్ తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు
కొనుగోలు కేంద్రాలు అందుకే ఏర్పాటు చేయలేదు..
అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కంటే వెయ్యి కోట్ల రూపాయలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేశామని వివరించారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ప్రతి రైతుకు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ఎకరానికి రూ.12,000 బోనస్ ఇవ్వాల్సి ఉందన్నారు.
Also Read: చికెన్ ధరలకు రెక్కలు..!
Also Read: పోలి పాడ్యమి రోజు.. ఇలా చేస్తే..
ముక్కు నేలకు రాస్తావా అంటూ సవాల్..
ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే.. తాను రాజీనామా చేస్తానని.. లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి ఇంటికి పోతాడా? అని సవాల్ విసిరారు. తనతో వస్తే.. కేసీఆర్ ఫామ్ హౌస్‌ను చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.
For Telangana News And Telugu News
Updated Date - Dec 01 , 2024 | 07:21 PM