ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దానంపై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు

ABN, Publish Date - Mar 31 , 2024 | 04:58 AM

ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని, స్పీకర్‌ వెంటనే స్పందించి ఆయనపై అనర్హత వేటు వేస్తే దేశం మొత్తం హర్షిస్తుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్‌, బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, మార్చి30(ఆంధ్రజ్యోతి): ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని, స్పీకర్‌ వెంటనే స్పందించి ఆయనపై అనర్హత వేటు వేస్తే దేశం మొత్తం హర్షిస్తుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్‌, బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మార్చి 18న శాసన సభాపతిని కలిసి దానం నాగేందర్‌ పై అనర్హత పిటిషన్‌ వేశామని, 12 రోజులైనా స్పందన లేకపోవడంతో అదనపు అఫిడవిట్‌ సమర్పించేందుకు వెళ్లగా ఎవరూ అందుబాటులో లేరని చెప్పారు. కార్యదర్శిపై ఏం ఒత్తిళ్లు ఉన్నాయో ఆయన కూడా అందుబాటులో లేరని తెలిపారు. లోక్‌సభ అభ్యర్థిగా దానం పేరును కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించిందని, సభాపతి నిర్ణయం తీసుకుని ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ చర్య తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. పార్టీ మారుతున్న నాయకులు రాజకీయ విలువలు లేని పవర్‌ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారని మరోనేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మండిపడ్డారు. కేశవరావు, కడియం శ్రీహరిలకు పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. బిడ్డల రాజకీయ జీవితం కోసం ఇద్దరు నేతలు బుడ్డెర ఖాన్‌లలా మారారని , ఇటువంటి వ్యతిరేక శక్తులు, ద్రోహులు ఎక్కడ పోటీ చేసినా ఉద్యమకారులు, నేతలు, కార్యకర్తలు ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అవకాశం ఇస్తే తాను వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఢిల్లీ కాంగ్రె్‌సకు ఏటీఎంలా రాష్ట్రం.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ కాంగ్రె్‌సకు ఏటీఎంలా మారిందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. సత్యదూరమైన మాటలతో సీఎం, మంత్రులు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎ్‌సపై ఏదో ఒక ఆరోపణ చేయాలనే ఉద్దేశమే కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోందన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఏప్రిల్‌ 6వ తేదీ నిర్వహించనున్న సభలో హామీలపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తామే న్యాయస్థానం అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రె్‌సకు అభ్యర్థులు లేక తమ నాయకులని తీసుకుంటున్నారని విమర్శించారు.

Updated Date - Mar 31 , 2024 | 04:58 AM

Advertising
Advertising