ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: చిట్టినాయుడు.. నువ్వా KCR పేరును తుడిచేది: కేటీఆర్

ABN, Publish Date - Oct 30 , 2024 | 02:56 PM

మరి కొన్ని రోజుల్లో రాష్ట్ర రాజకీయాల నుంచి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పేరు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు బుధవారం స్పందించారు.

హైదరాబాద్: మరి కొన్ని రోజుల్లో రాష్ట్ర రాజకీయాల నుంచి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పేరు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు బుధవారం స్పందించారు. తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును చెరిపితే చెరిగేది కాదని కేటీఆర్ పేర్కొన్నారు. "రేవంత్.. మీరు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశారు. పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశారు. ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టారు. నువ్వు సాధించుకున్న తెలంగాణను చంపేందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోశారు. చిట్టినాయుడు.. నువ్వా! KCR పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర KCR" అని కేటీఆర్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.


కాంగ్రెస్ కోతలకు లెక్కలేదు..

కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. "మూసీపై ముందుకు - కొనుగోళ్ళపై వెనక్కు. రామన్నపేటకు రైరై - కొనుగోలు సెంటర్లకు నై నై. దామగుండం ధనాధన్ - ధాన్యం కొనుగోళ్లు ఢాం ఢాం. కొనుగోళ్లకు దిక్కులేదు -కాంగ్రెస్ కోతలకు లెక్క లేదు. దళారులకు దండిగా - రైతన్నలకు దండగా. నాడు క్వింటాలుకు రూ.2,300 అమ్ముకున్న రైతు కాంగ్రెస్ సర్కా్ర్ పుణ్యమా అని నేడు రూ.1,800 లకు అమ్ముకుంటున్నాడు. ఎద్దేడ్చిన వ్యవసాయం - రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు"అని కేటీఆర్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి...

నాకు బిర్యానీ పెట్టండి

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్

Read Latet Telangana News And Telugu News

Updated Date - Oct 30 , 2024 | 02:56 PM