ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కేటీఆర్‌పై ఉట్నూర్‌ ఠాణాలో కేసు

ABN, Publish Date - Oct 16 , 2024 | 03:51 AM

మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఆదిలాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రూ.లక్షన్నర కోట్లు అంటూ ప్రచారం చేస్తున్న మూసీ ప్రాజెక్టు దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని, దేశంలో వచ్చే ఎన్నికల కోసం కావలసిన నిధుల కోసం కాంగ్రెస్‌ ఈ ప్రాజెక్టును రిజర్వ్‌ బ్యాంకులా వాడుకోవాలని చూస్తోందని 15 రోజుల క్రితం కేటీఆర్‌ విమర్శించారు. దీనిపై కాంగ్రెస్‌ నేత ఆత్రం సుగుణ గత నెల 30న ఉట్నూర్‌ పొలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్‌ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టిన పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 352, 353(2), 356(2) కింద కేసు నమోదు చేశారు.

Updated Date - Oct 16 , 2024 | 03:51 AM