ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Badradri: భద్రాద్రి రామాలయ ప్రధానార్చకుడిపై లైంగిక వేధింపుల కేసు

ABN, Publish Date - Sep 17 , 2024 | 03:50 AM

తన మామ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ.. భద్రాద్రి రామాలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై ఆయన కోడలు ఏపీలోని తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఆగస్టు 14న నమోదైన ఈ కేసు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • తాడేపల్లిగూడెం పోలీసులకు ఆయన కోడలి ఫిర్యాదు

భద్రాచలం, సెప్టెంబరు 16: తన మామ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ.. భద్రాద్రి రామాలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై ఆయన కోడలు ఏపీలోని తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఆగస్టు 14న నమోదైన ఈ కేసు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2019లో ఆమెకు సీతారామానుజాచార్యులు కుమారుడు వెంకట సీతారామ్‌తో వివాహం జరిగింది.


అనంతరం పలు సందర్భాల్లో మామ సీతారామానుజాచార్యులు తనను లైంగికంగా వేధించారని.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోడలు ఆరోపించారు. మామగారిని నిలదీస్తే.. ‘‘నా కుమారుడు దత్తపుత్రుడు. నాకు నా పోలికలతో ఒక బాబు కావాలి’’ అని చెప్పారని.. ఆయన గురించి పలుమార్లు అత్తకు, భర్తకు చెప్పినా పట్టించుకోకపోగా తననే తిట్టి, గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. పెళ్లయిన ఆర్నెల్ల తర్వాత నుంచి.. రూ.10 లక్షల కట్నం తేవాలంటూ అత్త, ముగ్గురు ఆడపడుచులు, రెండో ఆడపడుచు భర్త, మూడో ఆడపడుచు భర్త తనను వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వీరందరిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 17 , 2024 | 03:50 AM

Advertising
Advertising