ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రథం కేపీహెచ్‌బీలో!

ABN, Publish Date - Apr 22 , 2024 | 05:10 AM

ఎక్కడికైనా తెలియని చోటుకు వెళ్లాలంటే గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుంటాం! కానీ ఒక్కోసారి ఆ యాప్‌ మనల్ని మోసం చేస్తుంది. చేరాల్సిన చోటుకు కాకుండా వేరెక్కడికో

కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఎక్కడికైనా తెలియని చోటుకు వెళ్లాలంటే గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుంటాం! కానీ ఒక్కోసారి ఆ యాప్‌ మనల్ని మోసం చేస్తుంది. చేరాల్సిన చోటుకు కాకుండా వేరెక్కడికో తీసుకెళ్తుంది! చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి చెందిన ప్రచార వాహనం ఒకటి అలాగే ఆదివారం దారితప్పి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తెగ తిరిగేసింది!! సాధారణంగా పార్లమెంటు సీటుకు పోటీచేసే అభ్యర్థులకు.. తమ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వీధివీధినా తిరిగి ప్రచారం చేసే అవకాశం ఉండదు. అందుకే ప్రచార రథాలు ఏర్పాటు చేసుకుని వీధివీధినా తిప్పుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే.. రంజిత్‌రెడ్డి కొన్ని ప్రచార వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ, వాటిలో ఒకటి చేవెళ్ల పరిధిలో కాకుండా కేపీహెచ్‌బీలో తిరుగుతుండడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. కొంతమంది ఆ వాహనాన్ని ఆపి.. ‘‘మీ ప్రచార రథాన్ని ఇక్కడ ఎందుకు తిప్పుతున్నారు, ఇది ఏ నియోజకవర్గమో మీకు తెలుసా’’ అని అడిగితే.. ‘‘అవేమీ మాకు తెలియవు. మేము ఎక్కడ తిరగాలో గూగుల్‌ మ్యాప్‌ ద్వారా లొకేషన్‌ ఇచ్చారు.. దాని ప్రకారం తిరుగుతున్నాం’’ అని వాహనంలోని సిబ్బంది చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

Updated Date - Apr 22 , 2024 | 05:10 AM

Advertising
Advertising