Bhatti Vikramarka: ఆదాయం చేదు!
ABN, Publish Date - Nov 16 , 2024 | 03:36 AM
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం ఆశించిన మేర రావడం లేదు. ఏప్రిల్-అక్టోబరు మధ్య మూడు నెలల్లో రాబడి తగ్గింది. దీంతో అదనపు ఆదాయ వనరులపై దృష్టిసారించాలని సీఎం రేవంత్, ఆర్థిక శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి పలుసార్లు సూచించారు.
రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఆఫీసులోనే ఫైళ్లు
22ఏ మీద కలెక్టర్లు క్లియరెన్స్ ఇచ్చినా విపరీత జాప్యం
శేషాద్రి తర్వాత వచ్చినవారు ఒక్క ఫైలూ ఆమోదించలే
హైదరాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం ఆశించిన మేర రావడం లేదు. ఏప్రిల్-అక్టోబరు మధ్య మూడు నెలల్లో రాబడి తగ్గింది. దీంతో అదనపు ఆదాయ వనరులపై దృష్టిసారించాలని సీఎం రేవంత్, ఆర్థిక శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి పలుసార్లు సూచించారు. శాఖలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఈ మేరకు మెరుగుదల ఉంటుంది. కానీ, ఆ దిశగా స్పందన కొరవడిందనే విమర్శలున్నాయి. ఉదాహరణకు 22ఏ వివాదాలపై కోర్టు ఉత్తర్వుల ద్వారా లేదా కలెక్టర్ల నుంచి క్లియరెన్స్ అయి వచ్చిన ఫైళ్లను ఐజీ సంబంధిత జిల్లా రిజిస్ట్రార్లకు పంపాలి. కానీ, ఇవి ఐజీ కార్యాలయం దాటి బయటకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్లలో ఆదాయం సమకూరే ఈ తరహా ఫైళ్లు ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ పరిధిలో 50కి పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది.
సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న శేషాద్రి రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఉన్న సమయంలో 22ఏ వివాదంపై కలెక్టర్ల నుంచి వచ్చిన ఫైళ్లను వెంటనే జిల్లా రిజిస్ట్రార్లకు పంపేవారు. జిల్లాల రిజిస్ట్రార్లు సబ్ రిజిస్ట్రార్ల్లకు పంపి పర్యవేక్షణ చేసేవారు. తద్వారా స్టాంప్ డ్యూటీ, ఇతర సేవల రూపంలో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరేది. కాగా, శేషాద్రి తర్వాత వచ్చిన ఐజీలు ఫైళ్లను పెండింగ్‌లో పెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2024-25లో మే నెలలో రాబడి 18.06ు తగ్గింది. సెప్టెంబరులో -26.15ు, అక్టోబరులో -8.34 ు నమోదైంది. ఆదాయం పెరుగుదల కూడా అంతంతమాత్రమే ఉంది. ఏప్రిల్‌లో 2.55ు, జూన్‌లో 9.61 ు, ఆగస్టులో 0.77 శాతమే పెరిగింది. గత ఏడాదితో పోల్చితే.. జూలైలోనే 38.06 ు అదనపు రాబడి కనిపించింది.
Updated Date - Nov 16 , 2024 | 03:36 AM