ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahabubnagar: రైతు పండుగ విజయవంతం!

ABN, Publish Date - Dec 01 , 2024 | 03:15 AM

రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు పండగ విజయవంతమైంది. తొలి రెండ్రోజులు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

  • పాలమూరులో భారీగా తరలివచ్చిన ప్రజలు

  • సీఎం రాకకు ముందే నిండిన ప్రాంగణం

  • కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

మహబూబ్‌నగర్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు పండగ విజయవంతమైంది. తొలి రెండ్రోజులు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఇక, చివరి రోజు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరైన సభ సూపర్‌ సక్సెస్‌ కావడం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. లక్ష మంది రైతులతో సభ నిర్వహించాలని నేతలు భావించగా అదే సంఖ్యలో జనం తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునే రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.


ఇక, సీఎం రాకకు ముందే సభా ప్రాంగణం కూడా జనంతో నిండిపోయింది. ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తయ్యే వరకు రైతులు, ప్రజలు అక్కడి నుంచి కదలలేదు. ఇక, ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ రైతు పండగ విజయవంతంగా ముగియడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. జిల్లా కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎస్పీ జానకి నేతృత్వంలో యంత్రాంగం ఈ రైతు పండగ కోసం పది రోజులకు పైగా శ్రమించింది.

Updated Date - Dec 01 , 2024 | 03:15 AM